Skip to main content

Gurukula Teachers: గురుకుల టీచర్లకూ అవే సౌకర్యాలివ్వాలి

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో.. విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులకు ఇస్తున్న సౌకర్యాలను కల్పించాలని గురుకుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
Gurukula teachers should also be given the same facilities

గురుకుల ఉపాధ్యాయ బదిలీల సమయంలో స్పౌజ్‌ పాయింట్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, జ్యుడీషియల్, రైల్వే, బ్యాంకింగ్, ఇతర పీఎస్‌యూల పరిధిలోని వారిని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక పాయింట్లు ఇవ్వాలని కోరింది.

ప్రధానంగా జీవో 317 ద్వారా జరుగుతున్న ఉద్యోగ కేటాయింపుల్లో స్పౌజ్‌ అంశాన్ని తప్పకుండా పరిగణించాలని విన్నవించింది.

చదవండి: Gurukul School Students : శ్రేష్ఠ ప‌రీక్ష‌ల్లో గురుకుల విద్యార్థుల స‌త్తా.. పాఠ‌శాల స్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థి!

ఈమేరకు జూన్ 23న‌ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని గురుకుల జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్‌ మధుసూదన్, కె.జనార్దన్, ఎ.నర్సింహులు, ఎ.గణేశ్‌ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శాఖాపరమైన ఆదేశాలను త్వరలో జారీ చేస్తానని, ఈమేరకు సంబంధిత ఉన్నతాధికారులకు సూచనలు ఇవ్వనున్నట్లు వారికి హామీ ఇచ్చారు.  

Published date : 25 Jun 2024 10:05AM

Photo Stories