10 Days Schools Holidays : బ్రేకింగ్ న్యూస్.. 10 రోజులు స్కూళ్లకు సెలవులు.. కారణం ఇదే..
భారత్‌లో మెల్లమెల్లగా హెచ్3ఎన్2 వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలు నగరాల్లో చాప కింద నీరులా పాకుతున్న ఈ వైరస్ ఎఫెక్ట్ తాజాగా పుదుచ్చేరికి తాకింది. ఈ నేపథ్యంలో పాఠశాలలను 10 రోజులు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు.
మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలను..
సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా H3N2 వైరస్ కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారనే నివేదికల నేపథ్యంలో మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయాలని పుదేచ్చేరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు రోజు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో 23 ఏళ్ల వైద్య విద్యార్థి H3N2 వైరస్‌తో మరణించగా.. గుజరాత్‌లోని వడోదరలో ఈ వైరస్ కారణంగా మొదటి మరణం నమోదైంది.
ఈ వైరస్ పిల్లలు, వృద్ధులపై..
కర్ణాటకలోని హసన్ జిల్లాలో 82 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. హెచ్3ఎన్2 వైరస్ పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తోంది కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్‌లను మళ్లీ అనుసరించాల్సిన సమయం ఆసన్నమైందని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంట పాటించడంతో పాటు మహమ్మారి సమయంలో అనుసరించిన నియమాలను మళ్లీ పాటించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్