Telangana Schools Summer Holidays 2023 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్కూల్స్‌కు వేసవి సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే..?
1వ తరగతి నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 1-5 తరగతుల వారికి కేవలం నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఉండడంతో వారికి ఏప్రిల్ 17తో ఎగ్జామ్స్ పూర్తవుతాయి. 6వతరగతి నుంచి 9వ తరగతుల వారికి ఏప్రిల్ 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను 21వ తేదీన విడుదల చేయనున్నారు.
మొత్తం 48 రోజుల పాటు వేసవి సెలవులు.. తిరిగి స్కూల్స్‌ను..
ఏప్రిల్ 24న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.. విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చించాలని హెడ్ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. ఆ త్వరాత ఏప్రిల్ 25వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 11వ తేదీ వరకు కొనసాగనున్నాయి. దీంతో మొత్తం 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉంటాయి. అనంతరం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రాంరభం అవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
10వ తరగతి విద్యార్థులకు మాత్రం..
తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీరికి ప్రరీక్షలు ముగిసిన వెంటనే వేసవి సెలవులు ఉంటాయి.
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లు గందరగోళంగా మారిన విద్యావ్యవస్థ ఈ ఏడాది గాడిలో పడింది. ఈ సారి అనుకున్న సమయానికి సిలబస్ పూర్తి చేయడంతో పాటు.. పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
మార్చి 15వ తేదీ నుంచే ఒంటి పూట బడులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
తెలంగాణలో ఒంటి పూట బడుల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటనలో తెలిపింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటి పూట బడులు కొనసాగుతాయి. లాస్ట్ వర్కింగ్ డే అయిన.. ఏప్రిల్ 24 వరకు అన్ని స్కూళ్లు ఇదే టైమ్ టేబుల్ ఫాలో కావాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు అధికారులు. అన్ని స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది.