Skip to main content

AP Half Day Schools 2023 : ఏపీ ఒంటి పూట బడులు ఎప్పుటి నుంచి అంటే...? ఈసారి వేస‌వి సెల‌వులు భారీగానే ..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోని ఇప్ప‌టికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి.
AP Half Day Schools 2023 Telugu News
AP Half Day Schools 2023 Details

ఇంత ఎండల్లోనూ చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ బడుల్లోనే అవస్థలు పడుతున్నారు. ఫిబ్ర‌వ‌రి నెల పూరై మార్చి నెల‌లో కూడా వ‌చ్చింది. ఇంకా ఒంటిపూట బడులపై ఏపీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.

➤ AP & TS Schools Summer Holidays 2023 : ఏపీ, తెలంగాణ స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు ఎన్ని రోజులంటే..?

ఏటా మార్చి 15 నుంచే..
మాములుగా అయితే ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు పెట్టడం ఆనవాయితీ. ఆ సమయానికి ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న అంచనాతో దశాబ్దాల తరబడి ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. అయితే ఈసారి రాష్ట్రంలో ఆ విధానం అమలు చేస్తారో లేదో చుడాలి. ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించే అవ‌కాశం ఉంది. 

ఏపీ పాఠ‌శాల‌కు వేస‌వి సెలవులు మాత్రం..

ap summer holidays news telugu

అయితే ఉష్టోగ్రతలు ఒక‌వేళ ఇంకా ఎక్కువగా ఉంటే.. ఈ ఒంటిపూట బడులు కాస్త ముందుకు జరిగే అవకాశం కూడా ఉంది. అంటే మార్చి రెండో వారంలో లేదా మూడో వారం నుంచి ఒంటిపూట బడులను నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. దాదాపు 45 రోజులు పాటు ఏపీ పాఠ‌శాల‌కు వేస‌వి సెలవులు రానున్నాయి. ఒక వేళ ఎండ తీవ్ర‌త ఎక్క‌వ‌గా ఉంటే.. ఈ వేస‌వి సెల‌వుల‌ను పొడిగించే అవ‌కాశం ఉంది.

➤ TS Half Day Schools 2023 : ఒంటి పూట బడులు ఎప్పుటి నుంచి అంటే...? ఈ సారి భారీగానే వేస‌వి సెల‌వులు..

తెలంగాణ‌లో మాత్రం..

ap school holidays telugu news


తెలంగాణ పాఠ‌శాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బ‌డులు నిర్వహించాలని నిర్ణయించింది. పగలు ఎండ దంచి కొడుతుంది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. స్కూల్స్‌లోని విద్యార్థులు వేడికి మరింత ఇబ్బంది పడుతున్నారు.ఇక ఒంటి పూట బడులకు సంబంధించి కూడా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా క్లారిటీ ఇచ్చింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి స్కూల్స్ సగం పూటే నడుస్తాయని  తెలిపింది. అంటే విద్యాశాఖ అధికారుల నుంచి వస్తున్న అనధికార సమాచారం ప్రకారం మార్చి 15వ తేదీ (బుధవారం) నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు ప్రారంభం అవ్వనున్నాయి. ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. 

ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా..
ఈ ఒంటి పూట బడి సమయంలో ప్రవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన మంచినీరు పిల్లలకు అందేలా చూడాలని విద్యాశాఖ సూచించింది. ఇక తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది.  1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే అయినందున వారికి ఏప్రిల్ 17తో ముగుస్తున్నాయి.ఇక 6 నుంచి 9వ త‌ర‌గ‌తుల‌ వారికి ఏప్రిల్ 20 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 21వ తేదీన‌ వెల్లడించి రికార్డుల్లో పొందుపరచాలని విద్యాశాఖ తెలిపింది.

☛ ఏపీ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తెలంగాణ ఈ  సారి వేస‌వి సెల‌వులు భారీగానే..

Holidays News

ఇప్పటికే తెలంగాణ ప్ర‌భుత్వం వేసవి సెలవుల షెడ్యూల్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ఇటీవల వెల్లడించింది. తిరిగి పాఠశాలలు జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం అవ్వనున్నాయి. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

AP & TS 10th Class Study Material PDF 2023 : అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. అన్ని స‌బ్జెక్ట్‌ల‌ ప‌దో త‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్ ( TM & EM)

➤ TS 10th Class Model Papers Ebook 2023 : అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. అన్ని స‌బ్జెక్ట్‌ల‌ ప‌దో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేప‌ర్స్ (TM & EM)

Published date : 01 Mar 2023 02:43PM

Photo Stories