Skip to main content

TS Half Day Schools 2023 : ఒంటి పూట బడులు ఎప్పుటి నుంచి అంటే...? ఈ సారి భారీగానే వేస‌వి సెల‌వులు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ పాఠ‌శాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బ‌డులు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రం చలి తగ్గుముఖం పట్టింది.
half day schools in telangana
Half Day Schools

పగలు ఎండ దంచి కొడుతుంది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. స్కూల్స్‌లోని విద్యార్థులు వేడికి మరింత ఇబ్బంది పడుతున్నారు.

☛ TS Schools Summer Holidays 2023 : విద్యార్థులకు శుభ‌వార్త‌.. ఈ సారి భారీగానే వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఇక ఒంటి పూట బడులకు సంబంధించి కూడా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా క్లారిటీ ఇచ్చింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి స్కూల్స్ సగం పూటే నడుస్తాయని  తెలిపింది. అంటే విద్యాశాఖ అధికారుల నుంచి వస్తున్న అనధికార సమాచారం ప్రకారం మార్చి 15వ తేదీ (బుధవారం) నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు ప్రారంభం అవ్వనున్నాయి. ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. 

ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..

Half day schools instructions

ఈ ఒంటి పూట బడి సమయంలో ప్రవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన మంచినీరు పిల్లలకు అందేలా చూడాలని విద్యాశాఖ సూచించింది. ఇక తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది.  1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే అయినందున వారికి ఏప్రిల్ 17తో ముగుస్తున్నాయి.ఇక 6 నుంచి 9వ త‌ర‌గ‌తుల‌ వారికి ఏప్రిల్ 20 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 21వ తేదీన‌ వెల్లడించి రికార్డుల్లో పొందుపరచాలని విద్యాశాఖ తెలిపింది.

టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
 
ఈ  సారి వేస‌వి సెల‌వులు భారీగానే..

Summer Holidays News Telugu

ఇప్పటికే తెలంగాణ ప్ర‌భుత్వం వేసవి సెలవుల షెడ్యూల్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ఇటీవల వెల్లడించింది. తిరిగి పాఠశాలలు జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం అవ్వనున్నాయి. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

➤ AP & TS 10th Class Study Material PDF 2023 : అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. అన్ని స‌బ్జెక్ట్‌ల‌ ప‌దో త‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్ ( TM & EM)

➤ TS 10th Class Model Papers Ebook 2023 : అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. అన్ని స‌బ్జెక్ట్‌ల‌ ప‌దో త‌ర‌గ‌తి మోడ‌ల్ పేప‌ర్స్ (TM & EM)

Published date : 17 Feb 2023 03:35PM

Photo Stories