TS Schools Summer Holidays 2023 : విద్యార్థులకు శుభవార్త.. ఈ సారి భారీగానే వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?
1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి పరీక్షలను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం 1వ తరగతి నుంచి 5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉన్నందున వారికి ఎగ్జామ్స్ ఏప్రిల్ 17వ తేదీతో పూర్తి అవుతాయి. 6వ తరగతి నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షలు ఉంటాయి.
టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..?
ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ 21వ తేదీన విద్యార్థులకు వెల్లడించి.. రికార్డుల్లో నమోదు చేయాలని విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
వేసవి సెలవుల విషయానికి వస్తే.. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. 1వ తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలుంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
టిఎస్ ఇంటర్ : సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
ఒంటి పూట బడులు మాత్రం..
ఇంకా మార్చి సెకండ్ వీక్ నుంచి ఒంటి పూట తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రత అధికమయితే.. ఇంకా ముందుగానే ఒంటి పూట తరగతులను ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది.
ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు..
ఈ ఏడాది స్కూల్స్‌కు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. అనంతరం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.
2023లో వచ్చే సెలవుల పూర్తి వివరాలు..