Skip to main content

Free Coaching: యువతకు ప‌లు కోర్సులో ఉచిత శిక్షణ

వరంగల్‌: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు రెండు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పీసీసీఆర్‌ డైరెక్టర్‌ లక్ష్మి అక్టోబర్ 16న సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
 rural development training opportunities  Free training for youth in various courses  PCRR director Lakshmi giving a statement about free training for unemployed youth Free training program announcement for unemployed youth in Warangal

అకౌంట్స్‌ అసిస్టెంట్‌ (ట్యాలీ)లో రెండు నెలల శిక్షణకు బీకాం ఉత్తీర్ణత, బేసిక్‌ కంప్యూటర్స్‌ (డాటా ఎంట్రీ ఆపరేటర్‌) రెండు నెలల శిక్షణకు ఇంటర్‌ మీడియట్‌ ఉత్తీర్ణత, ఆటోమొబైల్‌–2 వీలర్‌ సర్వీసింగ్‌లో రెండు నెలల శిక్షణకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ప్రత్యేక వసతి ఉంటుందని తెలిపారు.

చదవండి: Free training: కంప్యూటర్‌ స్కిల్స్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, ఇంటర్య్వూ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ..15వేల జీతం కూడా

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ గ్రామంలో వేర్వేరుగా శిక్షణ తరగతులు ఉంటాయని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 28న ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు.

Published date : 18 Oct 2024 08:30AM

Photo Stories