Skip to main content

Free training: కంప్యూటర్‌ స్కిల్స్‌, స్పోకన్‌ ఇంగ్లిష్‌, ఇంటర్య్వూ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ..15వేల జీతం కూడా

Free training on computer skills
Free training on computer skills

కడప కోటిరెడ్డిసర్కిల్‌: ఉన్నతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బెంగుళూరు నగరంలో కంప్యూటర్‌ అండ్‌ ట్యాలీ కంప్యూటర్‌ స్కిల్స్‌, స్పోకన్‌ ఇంగ్లీషు, ఇంటర్వ్యూ స్కిల్స్‌ కోర్సులో ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఫౌండేషన్‌ అడ్మిషన్‌ కో–ఆర్డినేటర్‌ హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్మీడియట్‌ జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటన: Click Here

అర్హతలు
టెన్త్‌ పాస్‌, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ పాస్‌/ఫెయిల్‌ అయిన అభ్యర్థులు
వయస్సు 18 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి

శిక్షణా కాలం
35 రోజులపాటు కొనసాగే శిక్షణా కాలంలో అభ్యర్థులకు క్రింది విషయాల్లో శిక్షణ ఇస్తారు:

ట్యాలీ
జీఎస్టీ
కంప్యూటర్‌ స్కిల్స్‌
స్పోకన్‌ ఇంగ్లీషు
కమ్యూనికేషన్‌ స్కిల్స్‌
లైఫ్‌ స్కిల్స్‌
ఇంటర్వ్యూ స్కిల్స్‌
వర్క్‌ప్లేస్‌ ఎథిక్స్‌

ఉపాధి అవకాశాలు
శిక్షణానంతరం రూ 15 వేల వేతనంతో వివిధ సంస్థల్లో ఉపాధి కల్పిస్తారు.

సంప్రదించవలసిన నంబర్‌
పూర్తి వివరాలకు 90004 87423 నెంబరులో సంప్రదించండి.

 

Published date : 03 Oct 2024 08:46PM

Photo Stories