Skip to main content

Tomorrow Holiday : రేపు సెలవు.. ప్ర‌భుత్వం ఆదేశాలు.. కారణం ఇదే.. అలాగే 9వ తేదీన కూడా..!

సాక్షి ఎడ్యుకేషన : డిసెంబర్‌ 5వ తేదీన (గురువారం) సెలవు ప్రకటించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమర్‌ ప్రసాద్‌ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
tomorrow holiday 2024

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో డిసెంబర్‌ 5వ తేదీ పోలింగ్‌ సందర్భంగా.. స్థానికంగా పోలింగ్‌ తేదీ ముందు రోజే స్థానిక సెలవు ప్రకటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

9వ తేదీన కూడా సెలవు...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 9వ తేదీన నిర్వహించనున్నందున అవసరాన్ని బట్టి లెక్కింపు కేంద్రాలుగా ఉపయోగించుకునే కార్యాలయాలకు సెలవు ప్రకటించడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు.  

☛➤ 10 Days School holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ డిసెంబర్‌ నెలలో ఏకంగా 10 రోజులు స్కూళ్లకు సెలవులు!

మాకు కూడా.. ఆ రోజున..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఓటు వేసేందుకు సంస్థల యాజమాన్యాలు అనుమతివ్వాలని, ఓటు వేయడం ద్వారా డ్యూటీకి ఆలస్యంగా వచ్చేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.  అయితే స్కూల్స్, కాలేజీలకు సెలవుపై ఎలాంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేదు.

☛➤ 12days holidays: మహిళ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ 12రోజులు సెలవులు... ఎందుకంటే

2025 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

2025 జనవరి  :
☛➤ నూతన సంవత్సరం : 01
☛➤ భోగి : 13
☛➤ సంక్రాంతి : 14
☛➤ క‌నుమ : 15
☛➤ రిపబ్లిక్ డే : 26

ఫిబ్రవరి 2025 : 

☛➤ మహ శివరాత్రి : 26

మార్చి 2025 :
☛➤ హోలీ : 14
☛➤ ఉగాది : 30
☛➤ రంజాన్ : 31

ఏప్రిల్ 2025 :
☛➤ రంజాన్ తర్వాత రోజు : 01
☛➤ బాబు జగజ్జీవనరావు జయంతి :  05
☛➤ శ్రీరామ నవమి :  06
☛➤ అంబేడ్కర్ జయంతి :  14
☛➤ గుడ్ ఫ్రైడే :  18

మే 2025 :
మేడే : 1

జూన్ 2025 :
☛➤ బక్రీద్ :  07

జూలై :  2025
☛➤ మొహర్రం : 06
☛➤ బోనాలు : 21

ఆగస్టు 2025 :
☛➤ స్వతంత్ర దినోత్సవం : 15
☛➤ కృష్ణాష్టమి : 16
☛➤ వినాయక చవితి : 27

సెప్టెంబర్ 2025 :
☛➤ మిలాద్ నబీ : 05
☛➤ బతుకమ్మ మొదటి రోజు : 21

అక్టోబర్ 2025 :
☛➤ గాంధీ జయంతి : 02
☛➤ దసరా తర్వాత రోజు : 03
☛➤ దీపావళి : 20

నవంబర్  2025 :
☛➤ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి : 05

డిసెంబర్ 2025 :
☛➤ క్రిస్మస్ : 25
☛➤ క్రిస్మస్ తర్వాత రోజు : 26

Published date : 04 Dec 2024 05:25PM

Photo Stories