Skip to main content

Free Certificate Courses : 5 స‌ర్టిఫికెట్ కోర్సులు ఉచితంగా అందిస్తున్న గూగల్‌.. లాభాలు ఇవే..

ఈరోజుల్లో సాంకేతిక‌త ఎంత పెరిగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో ప్ర‌పంచంలోకి ఎన్నో ర‌కాల నైపుణ్యాలు, మ‌రెన్నో అభివృద్ధులు చోటుచేసుకున్నాయి.
Google offers five free certificate courses

సాక్షి ఎడ్యుకేష‌న్: ఈరోజుల్లో సాంకేతిక‌త ఎంత పెరిగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌తో ప్ర‌పంచంలోకి ఎన్నో ర‌కాల నైపుణ్యాలు, మ‌రెన్నో అభివృద్ధులు చోటుచేసుకున్నాయి. ఆన్‌లైన్ యాడ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). 1998లో స్థాపించిన ఈ సంస్థ, ఇప్పుడు ఆల్ఫాబెట్ ఇంక్. పేరుతో ప్రపంచాన్ని ఏలుతోంది.

ప్రస్తుతం, వివిధ రంగాల్లో త‌న‌దైన ముద్ర వేసుకుంది. అంతేకాకుండా, ప్రజలు కొత్త నైపుణ్యాలు నేర్చుకుని అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలను కూడా అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ టెక్ బ్రాండ్ మరో అదిరిపోయే ఆఫర్‌ తీసుకొచ్చింది. డేటా అనలిటిక్స్ రంగంలో మీ భవిష్యత్తును మార్చేసే 5 సర్టిఫికెట్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది.

Students Survey : తెలుగులో వెన‌క‌బ‌డిన విద్యార్థులు.. ఈ స‌ర్వే ప్ర‌కారం..!

1. గూగుల్ క్లౌడ్‌లో డేటా అనలిటిక్స్ పరిచయం:
ఇందులో డేటా అనలిటిక్స్ బేసిక్స్, క్లౌడ్ అనలిస్టుల పాత్ర, వారి బాధ్యతల గురించి నేర్పిస్తారు. 
ఈ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు https://www.cloudskillsboost.google/paths/420/course_templates/961 ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

2. క్లౌడ్‌లో డేటా విజువలైజేషన్:
డేటా విజువలైజేషన్ అనేది డేటాతో కథలు చెప్పడం లాంటిది. డేటాను బొమ్మల్లా చూపిస్తూ, అందరికీ అర్థమయ్యేలా చెప్పొచ్చు. అలా ప్రభావవంతమైన డేటా విజువలైజేషన్స్‌ని ఎలా తయారు చేయాలో ఈ కోర్సు నేర్పుతుంది., 
పూర్తి వివ‌రాల‌కు https://www.cloudskillsboost.google/paths/420/course_templates/964 లింక్ మీద క్లిక్ చేయండి.

Walk In Recruitment Drive 2025: టెన్త్‌/ఇంటర్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

3. క్లౌడ్ డేటా అనలిస్ట్ ఉద్యోగం కోసం సిద్ధం:
ఉద్యోగానికి సిద్ధమయ్యేందుకు ఒక కాప్‌స్టోన్ ప్రాజెక్ట్‌లో మీ నైపుణ్యాలను ఉపయోగించవచ్చు. 
ఈ లింకు మీద https://www.cloudskillsboost.google/paths/420/course_templates/965 క్లిక్ చేసి పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోండి.

4. క్లౌడ్‌లో డేటా మేనేజ్‌మెంట్, స్టోరేజ్:
ఇందులో డేటా ఆర్గనైజేషన్, లేక్‌హౌస్ ఆర్కిటెక్చర్, బిగ్‌క్వెరీ వంటి టూల్స్ గురించి తెలుసుకోవచ్చు. 
పూర్తి వివరాల కోసం ఈ లింక్‌ https://www.cloudskillsboost.google/paths/420/course_templates/962 పై క్లిక్ చేయండి.

5. క్లౌడ్‌లో డేటా ట్రాన్స్‌మర్మేషన్:
క్లౌడ్‌లో డేటా ట్రాన్స్‌మర్మేషన్ చేయాలంటే ఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు ఉండాలి. డేటాను మార్చి, దాన్ని విశ్లేషించడం ద్వారా, అందులోని విషయాలను తెలుసుకోవచ్చు. https://www.cloudskillsboost.google/paths/420/course_templates/963 లో పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 29 Jan 2025 04:10PM

Photo Stories