Skip to main content

NTPC Assistant Executive Posts: డిగ్రీ, BTech అర్హతతో NTPCలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టులు జీతం నెలకు 55,000

NTPC Assistant Executive Posts   Government job alert   NTPC Assistant Executive vacancies
NTPC Assistant Executive Posts

దేశంలోని అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), న్యూ దిల్లీ.. ఎన్టీపీసీ లిమిటెడ్ (NTPC) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్ 1382 మంది SGTలుగా నియామకం: Click Here

పోస్టు పేరు - ఖాళీలు
* అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్‌): 400 (యూఆర్‌-172; ఈడబ్ల్యూఎస్‌-40; ఓబీసీ-82; ఎస్సీ-66; ఎస్టీ- 40)
అర్హత: 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్ (మెకానికల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు రూ.55,000.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ-ఎన్‌సీఎల్‌ వారికి మూడేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది).

దరఖాస్తు ఫీజు: రూ.300. (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు).

ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్‌ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 15.02.2025.

దరఖాస్తు చివరి తేదీ: 01-03-2025.

Published date : 17 Feb 2025 09:06AM

Photo Stories