Skip to main content

Secundrabad Railway Jobs: సికింద్రాబాద్ రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు జీతం నెలకు 30,000

Indian Railways Job Notification   Secundrabad Railway Jobs  IRCTC Hospitality Monitor Recruitment 2025 Notification
Secundrabad Railway Jobs

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), సౌత్ సెంట్రల్ జోన్ నుండి హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను మార్చి 4వ తేదిన స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లలో పోస్టింగ్ ఇస్తారు.

10వ తరగతి అర్హతతో తెలంగాణ పోస్ట్‌ల్ సర్కిల్ భారీగా ఉద్యోగాలు జీతం నెలకు 29,380: Click Here

భర్తీ చేసే పోస్టులు : హాస్పిటాలిటీ మానిటర్స్ అనే ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం పోస్టులు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

వయస్సు వివరాలు : ఈ ఉద్యోగాలకు వయస్సు 28 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులు
SC, ST, OBC, PWD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఇస్తారు.

అర్హతలు : 
B.Sc. in Hospitality and Hotel Administration లేదా BBA/MBA (Culinary Arts) లేదా B.Sc. Hotel Management and Catering Science లేదా M.B.A (Tourism and Hotel Management) పూర్తి చేసి ఉండాలి.
రెండేళ్ళ అనుభవం ఉండాలి.

జీతం : 
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000/- జీతము ఇస్తారు. దీనితో పాటు ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు.
Daily Allowance – 350/-
Lodging Charges: Rs.240/-
National Holiday Allowance (NHA): Rs 384/-
Medical Insurance 

ఉద్యోగం కాంట్రాక్టు కాలం : రెండేళ్ల కాలానికి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవసరం మరియు అభ్యర్థి పనితీరు ఆధారంగా కొనసాగిస్తారు.

అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా మార్చి 4వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేసేవారు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక విధానం : అర్హత ఉండే అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

పోస్టింగ్ ప్రదేశం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లలో పోస్టింగ్ ఇస్తారు.

ఇంటర్వ్యు నిర్వహించే తేది : ఈ ఉద్యోగాలకు 04-03-2025 తేదిన నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ జరిగే చిరునామా : IRCTC , South Central Zone Zonal Office 1st Floor, Oxford Plaza, Sarojini Devi Road , Secunderabad – 500003

Download Full Notification: Click Here

Published date : 19 Feb 2025 08:52AM

Photo Stories