Skip to main content

Seize the School : నిబంధ‌న‌లను ఉల్ల‌ఘించిన పాఠ‌శాల‌.. త‌క్ష‌ణ‌మే సీజ్ అంటూ డిమాండ్‌!

Narayana education institutions to be seized for violating regulations    AISF and SFI leaders protesting against early admissions

రాయదురంటౌన్‌: ముందస్తు అడ్మిషన్లతో పాటు విద్యా సంవత్సరం పూర్తి కాకనే 9వ తరగతి విద్యార్థులకు టెన్త్‌ సిలబస్‌ బోధిస్తున్న నారాయణ విద్యా సంస్థను తక్షణమే సీజ్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎంఈఓ నాగమణికి ఫిర్యాదు చేయడంతో గురువారం ఆమె క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఆమె వెంట విద్యార్థి సంఘాల నాయకులు బంగి శివ, ఆంజనేయులు, కార్తీక్‌, వలి, నవీన్‌, మహబూబ్‌బాషా ఉన్నారు.

BCA Exams Time Table : ఏప్రిల్ 3 నుంచి బీసీఏ రెగ్యుల‌ర్, స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు..

పాఠశాలలో విద్యార్థులతో ఎంఈఓ మాట్లాడారు. నిబంధనలు ఉల్లఘించి పుస్తకాలు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. పుస్తకాలు నిల్వ ఉంచిన గదిని సీజ్‌ చేశారు. జిల్లాలోని నారాయణ విద్యా సంస్థలు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా, ఆ కళాశాల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో ఎంత మాత్రం చలనం లేదని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నారాయణ విద్యాసంస్థలను మూసేయాలని డిమాండ్‌ చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 21 Mar 2025 11:04AM

Photo Stories