BCA Exams Time Table : ఏప్రిల్ 3 నుంచి బీసీఏ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు..

సాక్షి ఎడ్యుకేషన్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ విద్యార్థులకు పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల.. ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీలు, సబ్జెక్టు, పరీక్షల వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుందని తెలిపారు.
No Protests in OU : ఇకపై ఓయూలో ధర్నా నిషేదం.. హైకోర్డు స్టే..
బీసీఏ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభం కాగా, అదే నెల 7వ తేదీన ముగుస్తాయని స్పష్టంగా ప్రకటించారు. పరీక్షలకు సమయానికి చేరుకోవాలని, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులకు సూచించారు. అలాగే, పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)