Skip to main content

No Protests in OU : ఇక‌పై ఓయూలో ధ‌ర్నా నిషేదం.. హైకోర్డు స్టే..

ఓయూలో విద్యార్థులకు ఏదైనా స‌మ‌స్య ఎదురైతే వాటిని ప‌రిష్క‌రించేందుకు నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేప‌ట్టడం ఎక్కువైయ్యాయ‌ని హైకోర్టు స్పందిస్తూ స్టే ఇచ్చింది.
High court stay order to stop rallys and protest in osmania university

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఓయూలో విద్యార్థులకు ఏదైనా స‌మ‌స్య ఎదురైతే వాటిని ప‌రిష్క‌రించేందుకు నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు చేప‌ట్టడం ఎక్కువైయ్యాయ‌ని హైకోర్టు స్పందిస్తూ స్టే ఇచ్చింది. ఇక‌పై, ఎలాంటి స‌మ‌స్య‌లున్నా వాటిని ప‌రిష్క‌రించేందుకు ఎవ్వ‌రు కూడా ఇలా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేప‌ట్ట‌రాద‌ని తేల్చి చెప్పింది హైకోర్డు. ఇటీవ‌ల‌, మ‌రోసారి వ‌ర్సిటీ వ‌ద్ద విద్యార్థులు ధ‌ర్నా చేప‌ట్ట‌గా హైకోర్టు వ‌ర్సిటీకి స్పందించి నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. ఇక‌పై వ‌ర్సిటీ వద్ద ఎలాంటి ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేప‌ట్ట‌రాద‌ని ఆదేశాలు ఇచ్చింది.

విద్యార్థులు వ‌ర్సిటీ ప్రాంగణంలో ఎదుర్కునే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు అధికార యాంత్రాంగం క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని తేల్చి చెప్పింది.

America Education Department : విద్యాశాఖ‌పై ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఈ కార‌ణంతోనే!

వారి స‌మ‌స్య‌ల‌ను నిజ‌మైతే ప‌రిష్క‌రించేందుకు రాజీప‌డ‌మ‌ని వివ‌రించింది వ‌ర్సిటీ. వ‌ర్సిటీలోకి ఎవ్వ‌రు కూడా అన‌ధికారికంగా ప్ర‌వేశించ‌రాద‌ని, ఎలా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేప‌ట్ట‌రాద‌ని ఈ మెర‌కు తేల్చేసింది హైకోర్టు.

చ‌ట్ట విరుద్దం..

ఓయూ ప‌రిధిలో ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు బ్యాన్ చేస్తూ ఓయూ అధికారులు ఈ నెల 13వ తేదీన ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో, ఈ ఉత్త‌ర్వులు చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ర‌ఫీ అనే వ్య‌క్తి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను కోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 21 Mar 2025 09:16AM

Photo Stories