World TB Day: మార్చి 24వ తేదీ ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం

ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం టీబీ నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన రాష్ట్రాలు, గ్రామాలకు ప్రత్యేక గౌరవం అందించనుంది. 100 రోజుల టీబీ నిర్మూలన ప్రచారం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పోరాటాన్ని 300 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో 50 వేల గ్రామాలు టీబీ నుంచి విముక్తి పొందినందుకు, వాటికి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. గత రెండేళ్లలో ఈ గ్రామాల్లో ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాలేదు.
International Forest Day: మార్చి 21వ తేదీ అంతర్జాతీయ అటవీ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
ఉత్తరప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలు, టీబీ నిర్మూలనలో చేసిన విశేష కృషికి గాను కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. మేఘాలయ రాష్ట్రం టీబీ బాధితులకు పోషకాహారం అందించడం ద్వారా ప్రత్యేక చొరవ తీసుకుంది. ఉత్తరప్రదేశ్ కూడా ఈ రంగంలో విశేష కృషి చేసింది.
టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బాక్టీరియాతో కలిగే అంటు వ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, నవ్వినప్పుడు లేదా అరచినప్పుడు ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.
2024లో.. 26.19 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు, ఇది నిర్దేశించిన లక్ష్యంలో 94%. భారతదేశం 2025 నాటికి టీబీని నిర్మూలించాలనుకొంటోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిలో విస్తృత ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా, 50 వేల గ్రామాలు టీబీ రహితంగా మారాయి.
Important Days: మార్చి నెలలోని జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు ఇవే..
క్షయ వ్యాధి ముఖ్య లక్షణాలు
కొన్ని నెలల్లోనే బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్ప స్థాయిలో జ్వరం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి దగ్గు తగ్గకపోవడం. రోగుల నుంచి నమూనాలు సేకరించి, పరిశోధనశాల్లో బ్యాక్టీరియాను ఒక గంటలో గుర్తించే విధంగా డీఎన్‌ఏ ఆధారిత పద్ధతిని బ్రిటన్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HPA) శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీంతో రోగనిర్ధారణ పరీక్ష త్వరగా అయిపోతుంది.