Skip to main content

Kusuma Dharmanna: మార్చి 17న తొలిత‌రం ద‌ళిత క‌వి కుసుమ ధర్మన్న జయంతి

అంటరానితనంపై పోరు సలిపిన తొలి తరం దళిత కవి కుసుమ ధర్మన్న.
Kusuma Dharmanna Birth Anniversary on March 7th

సంఘసంస్కరణ అభిలాష కలిగిన ఆయన అంబేడ్కర్ నుంచి స్ఫూర్తి పొందారు. అలాగే కందుకూరి వీరేశలింగం ద్వారానూ ప్రభావితమయ్యారు. 'మాకొద్దీ నల్ల దొరతనం' అంటూ నినదించిన ఆయన జాతిని మేల్కొల్పే దిశగా ఎన్నో రచనలు చేశారు. 'నిమ్న జాతి ముక్తి తరంగిణి', 'నల్ల దొరతనం', 'హరిజన శతకం' వంటివి ఆయన కలం నుంచి జాలువారినవే!

ధర్మన్న రాజమహేంద్రవరంలో 1900 మార్చి 17న జన్మించారు. సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూలలో పాండిత్యం కలిగిన వ్యక్తి. బహుముఖీనమైన ధర్మన్న ప్రతిభ ప్రధానంగా వైద్యరంగం, సాహిత్య సృజన, కళా రంగం, పత్రిక నిర్వహణ, వాక్తృత్వం రూపంలో విస్తరించింది. 

వైద్య విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడు అయిన ధర్మన్న తన వైద్యాన్ని గ్రామీణులకు, పేద దళితులకు అందించిన ప్రజా వైద్యుడు. ఆయన ఆధునిక ప్రజా వాగ్గేయకారుడు. ధర్మన్న తొలి రోజుల్లో గాంధీ సిద్దాంతాల వైపు చూసినా.. దళిత విముక్తికి అంబేడ్కర్ శరణ్యమని నమ్మి అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. 

Important Days in March 2025: మార్చి నెల‌లో జ‌రుపుకునే ముఖ్య‌మైన రోజులు ఇవే..

'జయభేరి' పత్రికను స్థాపించి తొలి దళిత పత్రిక సంపాదకులయ్యారు. 1925 నుంచి ఆంధ్ర దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగిన అఖిలాంధ్ర మహాసభల్లో ధర్మన్న ఆలోచనాత్మకమైన, ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఎన్నో చేశారు.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కవిగా, రచయితగా కుసుమ ధర్మన్న స్థానం అద్వితీయమైనది. వారి ఆశయాలను, ఆలోచనలను, ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక సేవను. సమతా వాదాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 17 Mar 2025 03:06PM

Photo Stories