DA and DR Increase: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
Sakshi Education
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

7వ వేతన సంఘం సిఫార్సుల్లో భాగంగా వారికి కరువు భత్యం (డీఏ) పెంపు పెరగనుంది. వారం రోజుల్లో ఈ మేరకు నిర్ణయం వెలువడే అవకాశముంది. డీఏ, డీఆర్ పెంపు నిర్ణయానికి ఈ మార్చి 12వ తేదీ జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడుతుందని భావిస్తున్నారు.
ఫలితంగా ఉద్యోగుల మూల వేతనంలో డీఏ 55 శాతానికి పెరగనుంది. దీనితో 1.2 కోట్ల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. కేంద్ర ఉద్యోగులకు ఏటా మార్చి, అక్టోబర్ మాసాల్లో రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది.
మార్చి పెంపు జనవరి నుంచి, అక్టోబర్‌లో ప్రకటించే పెరుగుదల జూలై నుంచి అమల్లోకి వస్తాయి. చివరి డీఏ పెరుగుదల జులై 2024లో 50 శాతం నుంచి 53 శాతానికి పెంచబడింది.
Mahila Samridhi Yojana: మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2500 ఇవ్వనున్న ప్రభుత్వం
Published date : 11 Mar 2025 03:19PM