TGSPDCL: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు మూడో ర్యాంక్

కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2023-24 డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీస్ ర్యాంకింగ్ (DUR) నివేదిక మరియు కన్స్యూమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్ (CSRD) నివేదికలో ఈ సంస్థ మూడవ స్థానాన్ని దక్కించుకుంది.
ఈ కేటగిరిలో మొత్తం 41 విద్యుత్ పంపిణీ సంస్థలకు ర్యాంకులు కేటాయించగా, TGSPDCL ఈ మెరుగైన స్థానం సాధించింది. సంస్థ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే కాకుండా, ఇతర డిస్కం సంస్థలతో పోలిస్తే తక్కువ సమయంలో కనెక్షన్లు ఇవ్వడం, పత్రాల సంధి సులభతరం చేయడం, ఖచ్చితమైన బిల్లింగ్, సరిగా మీటరింగ్ చేసే వ్యవస్థలు అమలు చేయడం వంటి పలు సేవలు అందించింది.
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం వెంటనే చేయడం, ఆన్‌లైన్ ద్వారా సర్వీసులను 99% వరకు అందించడం వంటి ప్రక్రియలతో సంస్థ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందిస్తోంది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)