Skip to main content

UNESCO Heritage: యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణలోని ముడమాల్‌ నిలువురాళ్లు

తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్‌లో ఉన్న నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది.
Menhirs of Mudumal in Telangana’s Narayanpet on tentative list of UNESCO World Heritage Sites

వీటితోపాటు అశోకుని శాసన నిలయాలు, చౌసట్టీ యోగినీ దేవాలయాల వంటి ఆరు చారిత్రాత్మక కట్టడాలను జాబితాకు భారత్‌ నామినేట్‌ చేసింది. వీటిని మార్చి 7వ తేదీ తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ఎక్స్‌లో తెలిపింది. 

ఒక ఆస్తిని ప్రపంచ వారసత్వ గుర్తింపు రావాలంటే.. వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌ తాత్కాలిక జాబితాలో చేర్చాలి. 

భారతదేశం నుంచి నామినేట్ అయిన ప్ర‌దేశాలు ఇవే..

  • ముడుమాల్‌ మెగాలితిక్‌ మెన్హిర్స్ - తెలంగాణ
  • కంగెర్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్ - చత్తీస్‌గఢ్
  • అశోకుని శాసన స్థలాలు - భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో.. 
  • మౌర్య రూట్స్ - పలు రాష్ట్రాల్లో..
  • చౌసత్‌ యోగిని దేవాలయాలు - పలు రాష్ట్రాల్లో..
  • గుప్తుల దేవాలయాలు -  ఉత్తర భారతంలో..
  • బుందేలాల రాజభవనాలు - మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్

వీటితో భారత్‌ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం 62కు చేరింది.

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 15 Mar 2025 04:22PM

Photo Stories