Retired Teacher Free Education : 2 దశాబ్దాల ముందు రిటైర్మెంట్.. ఇప్పుడు వేతనం లేని విద్యను అందిస్తూ.. అందరూ ఆశ్చర్యపోయేలా..

సాక్షి ఎడ్యుకేషన్: మనం ఒక పని చేయాలి అనుకుంటే అది ఎలాగైన పూర్తి చేయోచ్చు. అది చిన్నదైనా పెద్దదైనా.. మనం అనుకుంటేనే సాధ్యం అవుతుంది. ప్రతీ ఉద్యోగి ఒక వయసు తరువాత పదవీ విరమణ తీసుకుంటారు. ఇక, కష్టపడింది చాలు ఇంట్లో ఉందాలే అనుకుంటారు, లేదా ఏదైనా చిన్నచిన్న పనులు చేసుకుందాం అనుకుంటారు. అందులోనూ ఒక టీచర్ ఉద్యోగి అయితే, వారి ఇంట్లోని పిల్లలకు చదువు చెప్తారు. లేదా ఇంట్లోనే ట్యూషన్‌లు చెబుతారు. కానీ, లాభాల కోసం ఆలోచించకుండా కేవలం విద్యను పొందలేనివారికి, ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు, చదువుకోవాలని ఆశ పడేవారు, గొప్ప గొప్ప ఆశయాలు పెట్టుకున్నవారికి ఉచితంగా, నిస్వార్థంగా తన ఉద్యోగానికి న్యాయం చేస్తూ, ఒప్పుడు జీతంతో కూడిన ఉద్యోగం చేసి, ఇప్పుడు కేవలం విద్యార్థుల జీవితం కోసం ఉద్యోగం చేస్తూ ఉచితంగా పాఠశాలల్లో పాఠాలు చెబుతున్నారు ఓ ఉపాధ్యాయులు.
Osamu Suzuki : దిగ్గజ పారిశ్రామిక వేత్త.. ఒసాము సుజుకి.. ఈ పెరెలా..!
ఈరోజుల్లో పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లామా.. విద్యార్థులకు చదువు చెప్పామా.. సమయం ముగిసే సరికి తిరిగి ఇంటికి వచ్చేసామా.. సమయానికి జీతం తీసుకున్నామా.. అన్నట్లు ఉన్నారు చాలామంది. రిటైర్ అయ్యాక కొందరు విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నారు. మరికొందరు వారి పిల్లలకు చదువు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే, రిటైర్‌మెంట్ పూర్తి చేసుకున్న తరువాత కూడా విద్యార్థులకు తమ వంతు విద్యను అందించడం, తగిన బోధన ఇవ్వడం లాంటివి చాలా తక్కువ మంది చేస్తుంటారు. అందులో ఒకరే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి.
అప్పుడు జీతం కోసం.. ఇప్పుడు జీవితం కోసం
గతంలో, అంటే ఒక ఐదు దశాబ్దాల క్రితం.. నెలాఖరిలో వచ్చే కాసంత జీతంతో బ్రతికేవారు. ఎంతసేపు తన వంతు బోధనను విద్యార్థులకు అందించి వారికి ఉపాధ్యాయులుగా ఉండాలనే ప్రయత్నిస్తూ వచ్చారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బాల్ రెడ్డి. ఇతను ఐదు దశాబ్దాల కింద జీతం తీసుకుని బోధన అందించిన ఉపాధ్యాయులు అయితే, ఇప్పుడు రెండేళ్ల కింద పదవి విరమణ తీసుకున్నప్పటికీ..
Tohfa Handicrafts : ఉద్యోగం పోయింది.. చేతి విద్యతోనే సొంత వ్యాపారం.. ఉపాధి అవకాశాలతో..
నేడు తన సొంత గ్రామంలోని పాఠశాలలోనే ఏలాంటి జీతం తీసుకోకుండా తమ వంతు, తనకు వచ్చిన విద్యను ఆ పాఠశాలలోని విద్యార్థులకు చెబుతున్నారు. అసలు ఎవరు ఈయన.. ఈ ఉపాధ్యాయుని కథేంటి.. ఈ కథనం చదివండి..
వయసుతో సంబంధం లేదు..
ఒక వయసు వచ్చిన తరువాత, ప్రతీ ఒక్కరు వారి పిల్లలతో ఉండాలని, వారితో గడపాలని కోరుకుంటారు. అందులోనూ ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నవారు కూడా చాలావరకు అదే కోరుకుంటారు. అయితే, సిద్దిపేట జిల్లాకు చెందిన బాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు మాత్రం తన వయసు రిటైర్మెంట్‌కు వచ్చినందుకు విరమణ తీసుకున్నారే కానీ, తన వృత్తి నుంచి మాత్రం విరమణ ప్రకటించలేదు. ఇలా, తన వయసుతో సంబంధం లేకుండా తనకు వచ్చిన విద్యను, ఇన్ని సంవత్సరాలు తాను పాఠశాలలో అందించిన విద్యను తమ గ్రామంలోని విద్యార్థులకు అందించి, వారి భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ, ఇప్పటివరకు వేతనంతో కూడా విద్యను అందించిన వ్యక్తి ఇప్పుడు తృప్తితో కూడిన విద్యను అందించడం ప్రారంభించారు.
3 దశాబ్దాల విధులు..
ఆ మాస్టరు వయసు 80 సంవత్సరాలు. 1970 లో సర్కార్ ఉపాధ్యాయుడిగా వృత్తిలోకి వచ్చారు. తొలిసారి ములుగు మండలం అచ్చాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించారు. ఇలా, మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ బడుల్లోనే సుదీర్ఘంగా పేద విద్యార్థులకు విద్యా బోధన చేసి 2004వ సంవత్సరంలో జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్ పాఠశాలలో విధులకు చేరారు.
ఇక, అక్కడే తన పదవీ విరమణను ప్రకటించారు. కానీ, ఇన్ని సంవత్సరాలనుంచి అందించే బోధనను ఒక్కసారిగా ఆపలేక ఇప్పుడున్న విద్యార్థులకు చదువు చెప్పడం చాలాముఖ్యం అని భావించి, వేతనం తీసుకోని ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. అలా, తన స్వగ్రామం తిగుల్ కు రావడానికి రోజు 15 కిలో మీటర్లు ఆటోలో వచ్చి విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తారు. గడచిన దశాబ్ద కాలంగా స్వగ్రామం తిగుల్ లో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధిస్తున్నాడు.వయసుతో సంబంధం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతోనే గడుపుతున్నారు.
నాడు.. నేడు..
ఇప్పటి కాలంలో ఉద్యోగంలో ఉన్నవారే చిన్నచిన్న విషయాల్లో మనకెందుకులే అని అనుకునేవారు ఉన్నారు. అయితే, ఉద్యోగ విరమణ పొందిన తరువాత కూడా తన వద్ద ఉన్నది ప్రతీ ఒక్కరికి చేరాలని, విద్యార్థులు మనకు వచ్చిన బోధనను అందించాలని తమ వంతు ప్రయత్నంగా ఇంత కష్టపడుతూ.. విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడం, జీవితం గురించి తన అనుభవాన్ని పంచుకోడం, రానున్న రోజుల్లో ఉండే విషయాలపై చర్చించడం వంటివి చేస్తున్న ఈ పంతుల్ని చూసి ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.
అది కేవలం, టీచర్లకు మాత్రమే కాదు, ప్రతీ ఉద్యోగి, ప్రతీ మనిషి నేర్చుకోవాలి. గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద విద్యార్థులే విద్యను అభ్యసిస్తారని వారి కుటుంబాలకు వారి ఇంటి వద్ద ట్యూషన్ చెప్పించలేని పరిస్థితి ఉన్నందున విద్యార్థులకు ఉన్నత చదువులు చదువలనేదే తన ప్రయత్నం అంటూ రిటైర్డ్ మాస్టర్ బాల్ రెడ్డి వివరించారు. ఇక, ప్రస్తుత సమాజంలో ఇంకా ఇలాంటి వారు కూడా ఉన్నారా అంటూ ఈ మాస్టర్ పై సమాజంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- retired teacher
- government school teacher
- 30 years of teaching experience
- teacher duties
- retirement age
- school students education
- free education
- Poor Students
- free education for village students
- quality education
- Inspiring Teacher
- working retired teacher
- free and quality education for poor students
- Retired Teacher Bal Reddy
- Inspiring Story of Retired Teacher of Govt School Bal Reddy
- Govt School Teacher Post Retirement Work
- free education for students in village
- importance of education to students
- retired teacher duties
- Education News
- Sakshi Education News