Skip to main content

Jyoti Laboratories Founder Success Story : ఇందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేశా... ఈ వ్యాపారంతో కోట్ల రూపాయ‌లు సంపాదిస్తున్నా ఇలా.. కానీ.. !

జీవితంలో ఒక సాధించాల‌నుకుంటే ఎంత చిన్న‌దైనా, పెద్ద‌దైనా కృషి, ప‌ట్టుద‌ల తోడైతే సులువుగా చేర‌గ‌లం. అది, చ‌దువైనా, వ్యాపార‌మైనా, ఉద్యోగమైనా..
Success Story of Jyoti Laboratories Founder   Inspiring and successful story of jyoti laboratories founder m p ramachandran

సాక్షి ఎడ్యుకేష‌న్: జీవితంలో ఒక సాధించాల‌నుకుంటే ఎంత చిన్న‌దైనా, పెద్ద‌దైనా కృషి, ప‌ట్టుద‌ల తోడైతే సులువుగా చేర‌గ‌లం. అది, చ‌దువైనా, వ్యాపార‌మైనా, ఉద్యోగమైనా.. జీవితంలో స్థిర‌పడేందుకు కొంద‌రు ఉద్యోగాలు చేస్తూ ఉన్న‌త స్థాయికి ఎదుగుతారు. మ‌రి కొంద‌రు వ్యాపారం చేయాల‌నుకుంటారు. వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా.. ప‌ని ప‌నే.. అందుకే ఎందులో క‌ష్టాలు వ‌చ్చిన త‌ట్టుకొని ఎదిగే ప్ర‌య‌త్నాలు చేయాలి.

Follow our YouTube Channel (Click Here)

ఎంత లాభం వ‌స్తుందో ఒక్కొసారి అంత‌కు మించి న‌ష్టం వ‌స్తుంది. ఇటువంటి చాలా సంఘ‌ట‌న‌ల‌ను ఎద‌ర్కొని, త‌న జీవిత‌మే ఒక స‌వాల్ అని ముందుకు న‌డిచి చివ‌రికి ఒక‌ప్పుడు అప్పుచేసిన వ్య‌క్తే నేడు కొన్ని కోట్ల విలువ చేసే కంపెనీకి అధినేతగా ఎదిగారు. ప్ర‌స్తుతం, ప్ర‌తీ ఒక్క‌రికి ముఖ్యంగా వ్యాపార‌వేత్త‌ల‌కు నిలువెత్తు ఆద‌ర్శంగా నిలిచారు. ఇప్పుడు మ‌నం తెలుసుకొనున్న క‌థ ఆ వ్య‌క్తిదే..

Success Story of Tribal Women : తొలి ప్రయ‌త్నంలోనే గ్రూప్‌-1లో మెరిసిన గిరిజ‌న యువ‌తి.. ఈ ఉద్యోగం పొంది..

జ్యోతీ ల్యాబొరేట‌రీస్‌..

ప్ర‌తీ ఒక్క‌రికి 90వ ద‌శ‌కంలో టీవీలో వ‌చ్చే ఈ యాడ్ గుర్తుందా.. ‘నాలుగు చుక్కలతో వెలుగు వచ్చింది..’ ఇది ప్ర‌తీ ఇంటి మ‌హిళ‌కు గుర్తుంటుంది. ఎందుకంటే.. బ‌ట్ట‌లు ఉతికేందుకు మ‌హిళ‌లు అప్పుడు ఎక్కువ‌గా వాడేది ఈ ఉజాలా నీల్ లిక్విడ్‌ని కాబ‌ట్టి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న స‌క్సెస్ స్టోరీ ఈ అధినేత‌దే.. ఆయ‌నే జ్యోతి లేబొరేటరీస్ లిమిటెడ్ వ్యవస్థాపకులు యంపీ రామచంద్రన్.

TG DSC Topper Success Story : రిక్షా తొక్కి వ‌చ్చిన డ‌బ్బుతో నా కొడుకుని చ‌దివించానిలా... కానీ..

ఉద్యోగంలో ఇమ‌డ‌లేక సొంత వ్యాపారంలోకి..

ఒక‌ప్పుడు ఈయ‌న త‌న చ‌దువును పూర్తి చేసుకొని, ఒక అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తూ గ‌డిపేవారు. ఎందుకో కాని, ఆ ఉద్యోగానికి రాజీనామ చేసి తానే సొంతంగా ఒక వ్యాపారం ప్రారంభించాల‌నుకున్నారు. అయితే, మొద‌ట వంట‌ల‌కు సంబంధించిన ప్రాడ‌క్టు చేయాల‌ని నిర్ణయించుకొని ప్రారంభించారు కాని, ఫ‌లితం ద‌క్క‌లేదు. 

Follow our Instagram Page (Click Here)

5000 అప్పుతో..

మొద‌ట ప్రారంభించిన ప్రాడ‌క్టు ఫ‌లించ‌క‌పోవ‌డంతో మ‌రో ప్ర‌య‌త్నం ప్రారంభిస్తూ.. త‌న సోద‌రుని వ‌ద్ద నుంచి రూ. 5000 అప్పు చేసి 1983లో కేరళాలోని త్రిస్సూర్ లో కొద్ది పాటి భూమిని తీసుకొని చిన్న కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి పెట్టిన పేరే జ్యోతి ల్యాబ‌రేట‌రీస్‌. దీనిని త‌న కూతురైన జ్యోతి పేరుతో ప్రారంభించారు. 

బ‌ట్ట‌ల కోసం!

అలా, వంట కోసం చేసిన ప్ర‌య‌త్నం విఫ‌లం కాగా, ఈ పంటలో బ‌ట్ట‌ల‌కు సంబంధించ‌న ప్రాడ‌క్టు త‌యారు చేయాల‌నుకున్నారు. ఈ ప్ర‌క్రియను ప్రారంభించి, తెల్లగా చేసే ఉజాలా సుప్రీం లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్‌నర్ రూపొందించారు. ఈసారి త‌న ప్ర‌య‌త్నం ఫలించేస‌రికి, బృందంలో ఉన్న 6 మ‌హిళ‌ల ఇళ్ల‌కు విక్ర‌యించ‌సాగారు. మ‌హిళ‌లంద‌రికీ ఈ లిక్విడ్ బాగా న‌చ్చడం వ‌ల్ల దీనిని అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగించారు. 

Join our WhatsApp Channel (Click Here)

5 వేల అప్పు నుంచి 14,000 కోట్ల‌కు.. 

దీంతో కొద్ది కాలంలోనే త‌న ప్రాడ‌క్టైన ఉజాలా సుప్రీమ్ భారతీయు ఇంటింటికీ చేరి మంచి ఆధరణ సంపాదించింది. ఇక ఈ గెలుపుతో రామ‌చంద్ర‌న్ అనేక బ్రాండ్ల కంపెనీ సృష్టించారు. ఇలా, ప్ర‌యాణం మొద‌ట్లో 5000 అప్పుడు చేసిన వ్య‌క్తి నేడు ఆయ‌న ప్రారంభించిన జ్యోతి లేబరోటరీస్ మార్కెట్ క్యాప్టల్ రూ.135.83 బిలియన్లు, అంటే రూ.13,583 కోట్లు అన్నమాట.

Success Story of Young Farmer Rajeev Bhaskar : ఉన్న‌త ఉద్యోగానికి వ‌దిలి.. రైతుగా ఎదిగిన ఈ యువ‌కుడు.. ప్ర‌స్తుతం కోట్లల్లో సంప‌ద‌..! ఇదే ఇత‌ని స‌క్సెస్ స్టోరీ..

ప‌ట్టుద‌ల‌తోనే సాధ్యం

ఇలా, త‌న కృషి, ప‌ట్టుద‌ల‌, ఆత్మ విశ్వాసం, అంకిత‌భావం వంటివి జీవితంలో తోడైతే గెలుపు ఎన్న‌టికైన సొంతం అవుతుంద‌ని మ‌రొక‌రు నిరూపించారు క‌దా. వ్యాపార‌మై, ఉద్యోగ‌మైనా, చ‌దువైనా.. జీవితంలో ఏదైనా కృషి, ప‌ట్టుద‌లతోనే సాధ్య‌మ‌వుతుంది.

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Oct 2024 03:55PM

Photo Stories