Skip to main content

TG DSC Topper Success Story : రిక్షా తొక్కి వ‌చ్చిన డ‌బ్బుతో నా కొడుకుని చ‌దివించానిలా... కానీ..

తెలంగాణ‌ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన డీఎస్సీ ఫ‌లితాల్లో...చాలా మంది పేదింటి బిడ్ద‌లు... ఉద్యోగాలు సాధించి.. త‌మ క‌ల‌ల‌ను.. తల్లిదండ్రులు ఆశ‌యాల‌ను నేర‌వేర్చారు. ప్రస్తుత రోజుల్లో ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించడం అనేక మంది కల. ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలకు వేలు, లక్షల్లో పోటీ పడుతున్నప్పటికి తాము కలలు కన్న జాబ్ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడి.. చివరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు యువత.
DSC Ranker Success Story in Telugu

ఓ యువ‌కుడు కష్టపడి పోరాడితే సాధించనిది ఏదీ లేదని నిరూపించాడు. లక్షల మంది పోటీలో ఉన్నా ఇవేవి అతడు విజయాన్ని ఆపలేదు. అవకాశాన్ని అందిపుచ్చుకుని తన తలరాతను మార్చుకున్నాడు. 

➤☛ ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ జాబ్ కోసం...
ఈ ప్ర‌యాణంలో ఎన్నో అపజయాలు.. మరెన్నో ఒడుదొడుకులు.. కుటుంబ సభ్యుల త్యాగాలు.. సంవత్సరాల తరబడి నిరీక్షణ.. వెరసి చివరకు అతను ఇష్టంగా ఎంచుకున్న గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ జాబ్‌ సాధించాడు. ఈయ‌నే తెలంగాణ‌లోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన ముడావత్ గణేశ్.

➤☛ TG DSC 2024 Ranker Story : కూలీ ప‌ని చేసుకుంటూ.. చ‌దివి.. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్‌ ఉద్యోగం సాధించానిలా.. కానీ..

తండ్రి రిక్షా తొక్కుతూ, తల్లి పండ్లు అమ్ముతూ ..
టీఎస్‌ డీఎస్సీ-2024 ఫలితాల్లో ఎస్టీ విభాగంలో ఎస్జీటీ జాబ్ సాధించాడు. తండ్రి మూడావత్ పంతులు రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించేవారు. అలాగే తల్లి కూడా పండ్లు అమ్ముతూ కుటుంబాన్నికి తోడుగా ఉండేవారు. వీరికి నలుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు సంతానం. 

➤☛ TG DSC 2024 Ranker Success Story : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చ‌దివి.. టీచ‌ర్ ఉద్యోగం కొట్టానిలా... నా భార్య కూలీ చేసి.. !

వీరి వ‌ల్లేనే నాకు ఉద్యోగం వ‌చ్చింది...
చిన్న కుమారుడు గణేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో.. వారు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. గురువుల మార్గనిర్దేశం, కుటుంబ సభ్యుల‌ ప్రొత్సాహం వల్లే తాను జాబ్ కొట్టగలిగాను అని చెబుతున్నాడు గణేశ్. చదువు కుటుంబ పరిస్థితులను మార్చేస్తుంద‌న్నారు. అలాగే చ‌దువు తారతమ్యాలను చెరిపేస్తుంద‌ని.. మీ హోదాను పెంచుతుంద‌న్నారు. సమాజంలో మీకు గౌరవాన్ని ఇస్తుంద‌న్నారు. అందుకే ఎలాంటి క్లిష‌మైన టైమ్‌లో కూడా చదవును అశ్రద్ద చేయకండ‌న్నారు. మీరు కొంత‌ కాలం కష్టపడి చదివి.. జీవితాంతం సంతోషంగా ఉండండి అని... యువ‌త‌కు సందేశం ఇచ్చారు.

➤☛ Success Story : ఇలా చ‌దివి ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఒకే సారి 3 ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించా.. నా ల‌క్ష్యం ఇదే...

అన్నా చెల్లెళ్లకు ఒకేసారి..

dsc ranker success stories in telugu

ముత్తారం మండలంలోని కేశనపల్లికి చెందిన అన్నాచెల్లెలు ఒకే సారి ప్ర‌భుత్వ‌ ఉపాధ్యాయ కొలువులు సాధించారు. కేశనపల్లికి చెందిన కోళ్ల రాధ-కొమురయ్యలకు ముగ్గురు సంతానం. వీరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ఇటీవల డీఎస్సీ ఫలితాల్లో చిన్న కొడుకు సురేష్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో, కూతురు సుస్మిత ఎసీటీలో రెండో ప్రిన్సి ర్యాంక్ పొందారు.

☛➤ Two Sisters Success Story : ఓ తండ్రి క‌థ‌.. త‌మ‌ ఇద్ద‌రి కూతుర్ల‌ను ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలుగా చేశాడు ఇలా.. కానీ...

Published date : 17 Oct 2024 02:50PM

Photo Stories