Skip to main content

TG DSC Top Ranker Success Story : బ‌తుకు పోరాటంలో గెలిచిన పేదింటి బిడ్డ స‌క్సెస్ స్టోరీ ఇదే...!

ఈ పెదింటి బిడ్డ‌... చక్కగా చదువు కోవాలనుకుంది. అలాగే మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంది. కానీ క‌ఠిన పేదరికంతో.. ఆ చిన్నారిని బడి మాన్పించి ఇటుక బట్టీలో ప‌నిచేసేలా చేసింది. ఈ క‌ఠిన స‌మ‌యంలో ఒక దేవ‌త‌లా ఓ టీచరమ్మ ఆ చిన్నారికి తోడుగా నిలిచింది.
Telangana DSC Top Ranker Vijayalakshmi Success Story

మంచిగా చ‌దివించింది. నేడు అంద‌రు గ‌ర్వ‌ప‌డేలా... తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల విడుద‌ల చేసిన డీఎస్సీ ఫ‌లితాల్లో మంచి మార్కులు సాధించి... గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ ఉద్యోగం సాధించింది. ఈమె తెలంగాణ‌లోని మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన‌ కేతనపల్లి విజయలక్ష్మి. ఈ నేప‌థ్యంలో విజయలక్ష్మి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం : 
విజయలక్ష్మి తండ్రి నాగయ్య. ఈమెకు ఇద్దరు సోదరులు. వీరు కూలి పనులకు వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితి. ఇల్లు గడవడం కోసం విజయలక్ష్మి ఇటుక బట్టీలో బాలకార్మికురాలిగా పనిచేసింది. 

ఎడ్యుకేష‌న్ :
వారంలో మూడు రోజులు స్కూల్‌కి, మరో మూడు రోజులు పనికి వెళ్తుండేది. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఇలాగే కొనసాగించింది. తర్వాత నీల్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చేరింది. విజయలక్ష్మి పాఠశాలకు గైర్హాజరవుతున్న విషయం గుర్తించిన ఇంగ్లిష్‌ టీచర్‌ రాచకొండ కళ్యాణి.. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లింది. ఆ విద్యార్థిని సమస్యను అడిగి తెలుసుకుంది. ఆ కుటుంబం పరిస్థితులను చూసి చలించింది. ఆ స‌మ‌యంలో ఈ టీచ‌ర్‌.. ఉన్నతంగా చదువుకోవాలన్న శిష్యురాలికి అండగా నిలవాలనుకుంది. 

☛➤ TG DSC Ranker Success Story 2024 : పేదరికంతో పోరాటం చేస్తూ... అనుకున్న ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగం సాధించానిలా.. కానీ..

టీచర్‌ ప్రోత్సాహంతో విజయలక్ష్మి పదో తరగతిలో 9.5 జీపీఏతో ఉత్తీర్ణత సాధించింది.  అలాగే  ఇంటర్‌ కూడా చదివించేందుకు టీచర్‌ కళ్యాణి, ఆమె భర్త ముందుకు వచ్చారు. విజయలక్ష్మిని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చేర్పించారు. అక్కడే ఉండేలా వసతి ఏర్పాట్లు కూడా చేశారు. 

☛➤ TG DSC Topper Success Story : రిక్షా తొక్కి వ‌చ్చిన డ‌బ్బుతో నా కొడుకుని చ‌దివించానిలా... కానీ...

కొంతకాలం ఓ ఇటుక బట్టీలో పనిచేస్తూ.. 
ఈ దంప‌తులు విజయలక్ష్మికి హైదరాబాదులో డీఈడీ శిక్షణ ఇప్పించారు. 2018లో డీఎస్సీ కోసం ప్రయత్నించింది. కొద్దిలో ఉద్యోగ అవకాశం చేజారింది. తర్వాత కొంతకాలం ఓ ఇటుకబట్టీలో పనిచేస్తూ దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్ రావ‌డంతో ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి.. మంచి మార్కులు కొట్టి..సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఉద్యోగం సాధించింది. ఇటీవ‌లే ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయ‌ నియామక పత్రం అందుకుంది. 

➤☛ ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

అమ్మలాంటి కళ్యాణి టీచర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా..
తనను వెన్నంటి ప్రోత్సహించిన అమ్మలాంటి కళ్యాణి టీచర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాన‌ని విజయలక్ష్మి తెలిపింది.

➤☛ TG DSC 2024 Ranker Success Story : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చ‌దివి.. టీచ‌ర్ ఉద్యోగం కొట్టానిలా... నా భార్య కూలీ చేసి.. !

Published date : 21 Oct 2024 08:06AM

Photo Stories