Success Story : ఇలా చదివి ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఒకే సారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా.. నా లక్ష్యం ఇదే...
Sakshi Education
ప్రస్తుత రోజుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే... ఎంతో కష్టపడితేగాని వచ్చే అవకాశం లేదు. కానీ తెలంగాణలో చాలా మంది యువతకు ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా మూడు నాలుగు ఉద్యోగాలు సాధించి.. ఔరా అనే చేస్తున్నారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన... యువకుడు ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అబ్బురపరిచాడు.
తన మామ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన కోలా వినయ్ కుమార్ స్కూల్ జిల్లా అసిస్టెంట్ సోషల్‌లో 10వ ర్యాంక్, జిల్లా ఎస్జీటీలో 38వ ర్యాంక్, వసతి గృహ సంక్షేమ అధికారి జోనల్‌లో 58వ ర్యాంక్ సాధించి ఒకేసారి మూడు ప్రభుత్వ కొలువులను సాధించాడు. తన మామ అయిన పసుల స్వామి పౌర సరఫరాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతన్ని ఆదర్శంగా తీసుకొని నిత్యం సాధన చేసి కొలువులను సాధించానని కోలా వినయ్ కుమార్ తెలిపారు.
ఎలాంటి కోచింగ్ లేకుండానే..
ఈ కొలువులు తన తండ్రి, మామ స్వామిల నిరంతర ప్రేరణతో ఎలాంటి కోచింగ్ లేకుండా సొంత నోట్స్, పక్కా ప్రణాళికతో, రోజు వారి మోక్ టెస్ట్ రాయడం వల్ల సాధ్యం అయిందని అంటున్నాడు. అంతే కాకుండా తదుపరి గ్రూప్ 1 కూడా సాధించి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వినయ్ తెలిపాడు.
Published date : 04 Oct 2024 05:08PM
Tags
- Success Story
- Failure to Success Story
- Government Jobs
- Inspire success in telugu
- true inspirational stories
- true inspirational stories in telugu
- true inspirational stories telugu
- inspirational story about life and struggles
- government teacher success story
- Government Teacher Jobs
- kola vinay kumar got three government jobs
- real life inspirational stories of success
- real life inspirational stories of success in telugu
- real life inspirational stories of success news telugu
- dsc top rankers success stories in telangana
- dsc top rankers success stories
- dsc top rankers success stories telugu
- ts dsc ranker success stories
- ts dsc ranker success stories in telugu
- kola vinay kumar got three government jobs real life story
- kola vinay kumar got three government jobs real life story telugu in telugu
- Inspiring Story
- Success Story
- sakshieducation success story