Skip to main content

Inspiring Woman Success Story: అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి, ఇండియాలో రూ.120 కోట్ల కంపెనీ...ఈమె ఎవరో తెలుసా..?

Ahana Gautam  Success story of Ahana Gautam  Ahana Gautams journey of self-confidence and success in business
Ahana Gautam

సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అనుకున్న లక్ష్యాన్ని  చేరుకోవచ్చు. అలా అమెరికాలో ఐదెంకల జీతం వచ్చే  ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టి తానేంటో నిరూపించుకుంది అహానా గౌతమ్.  ముఖ్యంగా  తల్లిపై  ఉన్న నమ్మకంతో ముందడుగు వేసి,  రూ. 120కోట్ల కంపెనీకి  అధిపతిగా మారింది. అహానా గౌతమ్‌ సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందామా!

భారతీయ ఫుడ్‌ను పరిచయం చేయాలనే..

రాజస్థాన్‌లోని ఒక చిన్న నగరానికి చెందిన అహానా గౌతమ్ ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ , హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో (2014-2016) ఎంబీఏ  పట్టా పుంచుకుంది.  ఆ తరువాత ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (P&G)లో నాలుగేళ్లు ఉద్యోగం చేసింది. అక్కడే ఆరోగ్యకరమైన  భారతీయ ఫుడ్‌ను పరిచయం చేయాలనే ఆలోచన వచ్చింది. అధిక బరువుతో ఉండే ఆమె హెల్దీ ఫుడ్‌ ప్రాముఖ్యతను గుర్తించింది.  అంతే 30 ఏళ్ల వయసులో కీలక నిర్ణయం తీసుకుంది.  కృత్రిమ రంగులు, రుచులు ,శుద్ధి చేసిన చక్కెరలో అధికంగా ఉండే జంక్ ఫుడ్ నుంచిన బయటపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఓపెన్ సీక్రెట్ వ్యవస్థాపక  సీఈవోగా..

సొంతంగా ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని అందించే వ్యాపారం ప్రారంభించాలని ఉద్యోగం వదిలి భారత్ కు తిరిగివచ్చింది.  తల్లి ఇచ్చిన ఆర్థిక సాయంతో 2019లో  ‘ఓపెన్ సీక్రెట్’ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించింది.  కేవలం మూడేళ్లలోనే కంపెనీ ఆదాయాన్ని రూ. 120 కోట్లకు చేరేలా శ్రమించింది. ఓపెన్ సీక్రెట్ వ్యవస్థాపక  సీఈవోగా  విజయపథంలో దూసుకుపోతోంది. అనేక సవాళ్ల మద్య  2024 నాటికి కంపెనీ టర్నోవర్‌  రూ. 100కోట్లుగా ఉంది.

అహానా గౌతమ్  ఏమంటారంటే..

"ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే.. అది మా అమ్మ వల్లనే. ఆమె ఎప్పుడూ నాకు రెండు విషయాలు చెబుతుండేది: నంబర్ వన్ విద్య చాలా ముఖ్యం. మీరు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు. విద్యే మన ప్రపంచంలో మార్పు తీసుకొస్తుంది, రెండోది ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం, ఒకసారి ఆర్థిక సాధికారత సాధిస్తే, జీవితంలో ఎలాంటి నిర్ణయాలైనా సంతోషంగా తీసుకోవచ్చు."  అమ్మ చెప్పిన ఈ మాటలే తనలో స్ఫూర్తినింపాయని, ఐఐటి-బాంబే, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు వెళ్లి చదవడానికి  ప్రేరణ నిచ్చాయని తెలిపింది అహానా. చివరికి ధైర్యంగా ఒక కంపెనీ స్థాపనకు నాంది పలికాయని వెల్లడించింది.

అంతే కంపెనీని ప్రారంభించే ముందు వివాహం చేసుకోవాలని అందరూ  పట్టుబడితే తనకు అండగా నిలబడి, ఆర్థిక సాయాన్ని అందించి వెన్నుదన్నుగా నిలబడ్డారంటూ తల్లి గర్వంగా చెబుతుంది. అహానా తల్లి కోవిడ్‌ రెండో వేవ్‌లో  కరోనా కారణంగా చనిపోయారు.
 

Published date : 18 Nov 2024 09:34AM

Photo Stories