Skip to main content

Success Story : మాది పేద కుటుంబం. కానీ చ‌దువులో మాత్రం కాదు... నేను ఈ ఉద్యోగం చేస్తూనే...

పేద కుటుంబం. కానీ చ‌దువుకు మాత్రం కాదు. ఆమె లక్ష్యానికి పేదరికం అడ్డురాలేదు.
srilatha real life success story

ఓ మారుమూల పల్లెటూరులో పేద కుటుంబంలో పుట్టి.. అనేక కష్టాలు ఎదుర్కొని పట్టుదలతో చదివి... జాతీయ స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది పోలేపొంగు శ్రీలత. ఐసీఏఆర్–ఏఆర్ఎస్ 2023 నోటిఫికేషన్‌లో ఆల్ఇండియా ఐదో ర్యాంకు సాధించి.. ఓపెన్ క్యాటగిరిలో ఏఆర్ఎస్ సైంటిస్ట్‌గా సెలెక్ట్ అయ్యింది శ్రీలత. ఈ నేప‌థ్యంలో శ్రీలత స‌క్సెస్ స్టోరీ మీకోసం...

కుటుంబ నేప‌థ్యం :
తెలంగాణ‌లోని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సుబ్లేడు గ్రామానికి చెందిన వారు పోలపొంగు శ్రీలత. ఈమె త‌ల్లిదండ్రులు పోలెపొంగు జగ్గయ్య – కృష్ణకుమారి. వీరికి శ్రీలతతో పాటు కుమారుడు లక్ష్మణరావు ఉన్నారు. 

➤ Inspirational Story : మాది సంచార జాతి.. చిత్తు కాగితాలు ఏరి, భిక్షాటన చేసి చ‌దివి.. నేడు డీఎస్సీ ఉద్యోగం కొట్టానిలా... కానీ..

ఎడ్యుకేష‌న్ :
శ్రీలత.. సుబ్లేడులోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వరకు, ఐదు నుంచి 10వ తరగతి వరకు వైరా ఎస్సీ బాలికల హాస్టల్‌లో చదివింది. ఆ తర్వాత విజయవాడలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు.  బీఎస్సీ అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీలో పూర్తి చేసింది. మహారాష్ట్రలో ఎమ్మెస్సీ(ప్లాంట్ పాథాలజీ) పూర్తి చేశాక.., హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల పిహెచ్‌డి(PHD) పట్టా అందుకుంది. 

➤☛ Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

ఆపై శ్రీలత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికై, తాను బీఎస్సీ చదువుకున్న అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీలోనే పాఠాలు బోధిస్తోంది. అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షలో జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ మేరకు ప్లాంట్ పాథాలజీ(మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగం ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఐదో ర్యాంకు సాధించింది. దీంతో జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐకార్)లో శాస్త్రవేత్తగా అవకాశం దక్కించుకుంది.

➤☛ Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

ఉద్యోగం చేస్తూనే...
ఓ పక్క అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూనే, శ్రీలత అగ్రికల్చర్ సైంటిస్ట్ రెక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్ఆర్బీ) నిర్వహించే పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించింది. తద్వారా మొక్కలపై పరిశోధన కోసం శాస్త్రవేత్తగా ఎంపిక కావాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. వచ్చే నెలలో ఐకార్‌లో శాస్త్రవేత్తగా కొద్ది రోజుల్లో ఆమె పోస్టింగ్ అందుకోబోతున్నారు. 

నా ల‌క్ష్యం ఇదే..
మొక్కల వ్యాధి నివారణ, తక్కువ ఖర్చుతో రసాయన, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి అధిక, ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించేలా పరిశోధనలు చేయాలన్నదే తన లక్ష్యమని శ్రీలత వెల్లడించింది. నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచింది శ్రీలత.

☛➤ Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

Published date : 03 Jan 2025 10:07AM

Photo Stories