Skip to main content

List of Exams in January 2025: సీబీఎస్‌ఈ టూ జేఈఈ మెయిన్స్ వరకు.. జనవరిలో జరగనున్న పరీక్షల లిస్ట్‌ ఇదే

కొత్త సంవత్సరం ప్రారంభమయ్యింది. ఈ ఏడాది జనవరి నుంచే పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇస్రో, యూజీసీ నెట్‌ మొదలుకొని జేఈఈ మెయిన్‌ వరకూ పలు పరీక్షలు ఈ నెలలోనే జరగనున్నాయి. అవేంటో చూసేద్దాం.
List of Exams in January 2025   ISRO exam announcement for January 2025  UGC NET exam details January 2025  JEE Main exam announcement for January 2025  Upcoming exams in January 2025  January 2025 exams calendar
List of Exams in January 2025 Exam Reminder for January 2025: Check UPSC and Other Competitive Exams' Dates

జనవరి 2025లో జరగనున్న పరీక్షలు ఇవే..

 

సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ పరీక్షలు
ఈ సంవత్సరం ప్రారంభంలోనే సీబీఎస్‌ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సీబీఎస్‌ఈ బోర్డు రెగ్యులర్ సెషన్ పాఠశాలలకు 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి 14 మధ్య జరగనున్నాయి.

యూజీసీ నెట్‌ పరీక్ష
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డిసెంబర్ 2024 సెషన్ కోసం యూజీసీ నెట్‌ పరీక్షను 2025, జనవరి 3, నుండి జనవరి 16 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష 85 సబ్జెక్టులలో కొనసాగుతుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు
యూపీ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 23 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష జనవరి 23 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు రెండు దశల్లో నిర్వహించనున్నారు.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్-2 పరీక్ష
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్‌)టైర్-2 పరీక్షను 2025, జనవరి 18, 19,20 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా గ్రూప్ బీ, సీ మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2కు హాజరుకాగలుగుతారు. మరింత సమాచారం కోసం ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

యూకేసీఎస్‌సీ ఎస్‌ఐ పరీక్ష
ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ (యూకేసీఎస్‌సీ ఎస్‌ఐ) పోస్టుల రిక్రూట్‌మెంట్ పరీక్ష తేదీని ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025, జనవరి 12న నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు  పరీక్ష ఉండనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను 2025, జనవరి 2 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 222 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

యూపీఎస్‌సీ సీఎస్‌ఈ 2024 ఇంటర్వ్యూ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) జనవరి 7 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలు, ఇతర వివరాల కోసం యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inని సందర్శించవచ్చు.

జేఈఈ మెయిన్స్ పరీక్ష
ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి సెషన్ 2025, జనవరి 22 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది. అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు జారీ చేస్తారు. అయితే పరీక్ష జరిగే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాల కోసం nta.ac.in ని సందర్శించవచ్చు. 

Exam Dates  In January 2025

పరీక్ష పేరు పరీక్ష తేదీలు
ISRO-HSFC వివిధ ఖాళీల 2024 CBT పరీక్ష తేదీ 02/01/2025
DSE తెలంగాణ – TG TET 2024 పరీక్ష షెడ్యూల్ 02 నుండి 20/01/2025
TSPSC – మహిళా & శిశు సంక్షేమ అధికారి 2022 కొత్త రాత పరీక్ష షెడ్యూల్ 03 & 04/01/2025
TSPSC – (సూపర్‌వైజర్‌) గ్రూప్ I 2022 కొత్త రాత పరీక్ష షెడ్యూల్ 06 & 07/01/2025
NTA – UGC NET డిసెంబరు 2024 పరీక్ష షెడ్యూల్ 03/01/2025 నుంచి 16/01/2025
BPSC 70వ CCE 2024 ప్రీలిమ్స్ రీ-ఎగ్జామ్ తేదీ 04/01/2025
అలహాబాద్ హైకోర్టు – గ్రూప్ C & D 2024 స్టేజ్-I పరీక్ష తేదీ 04 & 05/01/2025
UPSSSC ఆడిటర్ & అసిస్టెంట్ అకౌంటెంట్ 2023 రాత పరీక్ష తేదీ 05/01/2025
UPSSSC – డెంటల్ హైజీనిస్ట్ 2023 రాత పరీక్ష తేదీ 05/01/2025
గుజరాత్ పోలీసు – PSI, కాన్స్టేబుల్ & జైల్ సిపాయ్ 2024 ఫిజికల్‌ టెస్ట్‌ తేదీ 08/01/2025 నుంచి
PSSSB – స్టెనో టైపిస్ట్ 2023 రీ షెడ్యూల్డ్ రాత పరీక్ష & స్కిల్ టెస్ట్ తేదీ 11/01/2025
JKPSC – వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ 2024 కొత్త రాత పరీక్ష తేదీ 12/01/2025
కేరళ TET నవంబర్ 2024 పరీక్ష తేదీ 18 & 19/01/2025
OSSC కాంబైన్డ్ టెక్నికల్ సర్వీస్ (JE) 2023 ప్రిలిమినరీ పరీక్ష తేదీ 19/01/2025
GPSC వివిధ ఖాళీల 2024 ప్రిలిమినరీ పరీక్ష షెడ్యూల్ 23/01/2025 నుంచి 16/02/2025
సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు 01/01/2025 నుంచి 14/02/2025
యూజీసీ నెట్ 2024 పరీక్ష 03/01/2025 నుంచి 16/01/2025
యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు 23/01/2025 నుంచి 31/01/2025, 01/02/2025 నుండి 08/02/2025
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్-2 పరీక్ష 18, 19, 20/01/2025
యూకేసీఎస్‌సీ ఎస్‌ఐ పరీక్ష 12/01/2025 (11 AM - 2 PM)
యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ 2024 ఇంటర్వ్యూలు 07/01/2025 నుంచి
జేఈఈ మెయిన్స్ 2025 పరీక్ష 22/01/2025 నుంచి 31/01/2025

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 

Published date : 04 Jan 2025 10:38AM

Photo Stories