Skip to main content

Employee Salary Increase : ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక కనీస వేతనం రూ. 30 వేలు.. ఎలా అంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశంలో కార్మికుల సామాజిక భద్రతను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నెలవారీ జీతాల పరిమితిమిని రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
employee salary increase  Modi government plans to increase social security for workers  Employee benefits and social security updates in India

ప్రస్తుతం ప్రావిడెంట్‌ ఫండ్ పథకంలో చేరడానికి కనీస వేతన పరిమితి రూ.15,000గా ఉన్న విషయం తెల్సిందే. అయితే దీనిని రూ.30 వేలకు పెంచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీత పరిమితిని ఈపీఎఫ్‌తో సమానంగా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. నెలవారీ జీతాల పరిమితిని ఏకంగా రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో ఉన్న ఉద్యోగుల జీవితాలు భారీ మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు..
ప్రస్తుతం ఈపీఎఫ్‌లో ఉద్యోగులు, యజమానులు 12 శాతం చొప్పున ఫండ్‌ చెల్లిస్తున్నారు. ఒకవేళ నెలవారీ జీతం పరిమితిని రూ.30,000 పెంచితే.. ఎంప్లాయి షేర్‌ రూ.3600కి పెరుగుతుంది. దీంతో ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు మెరుగైన పెన్షన్‌ పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీంతో దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.ఇందులో భాగంగానే సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఇటీవల సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 

➤☛ Government Jobs : ప్ర‌భుత్వ శాఖ‌ల్లో కొత్త‌గా 13,000కుపైగా ఖాళీలు.. వీఆర్ఓలు, వీఆర్ఏలు..!!

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. జీత పరిమితిని పెంచిన తర్వాత ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐసీ రెండూ ఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతంలో కొంత భాగంతో పాటు, యజమానుల కూడా కొంతమేర ఫండ్‌ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈపీఎఫ్‌ లిమిట్‌ను కేంద్ర ప్రభుత్వం 2014లో మార్చిన విషయం తెలిసిందే. ఆ సమయానికి రూ.6500గా ఈపీఎఫ్‌ లిమిట్‌ను రూ.15,000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రూ.15 వేల కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులు కచ్చితంగా ఈపీఎఫ్‌ను ఎంచుకోవాల్సిందే. అయితే ఇప్పుడు పరిమితిని పెంచితే ఎక్కువం మంది సభ్యులుగా చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అమల్లోకి వస్తే ఈపీఎఫ్‌ స్కీమ కింద వచ్చే కొత్త ఉద్యోగుల వేతన నిర్మాణంలో కూడా మార్పులు ఉంటాయి.

➤☛ Surveyor Jobs Recruitment: 10వ తరగతి అర్హతతో తెలంగాణలో 1000 సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ

ఒకవేళ వేతన పరిమితిని పెంచితే. ఈపీఎఫ్ ఖాతా, ఉద్యోగుల పెన్షన్ ఖాతాలోకి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అవుతుంది. ఉద్యోగి వాటాతోపాటు యజమాని సహకారం కూడా పెరుగుతుంది. దీంతో దేశంలో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 

యాజమాన్యం ఈపీఎఫ్‌కు 12 శాతం...
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ రంగంపై ఆర్థిక భారం పడుతుంది. కంపెనీలు కనీస వేతనాన్ని పెంచాలి ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీలో 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ కచ్చితంగా ఈపీఎఫ్‌లో నమోదు చేసుకోవాలనే విషయం తెలిసిందే. జీతం తీసుకునే ఉద్యోగి, యాజమాన్యం ఈపీఎఫ్‌కు 12 శాతం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.

AP Grama Sachivalayam Employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఇక‌పై వీరు.. !

Published date : 27 Dec 2024 03:51PM

Photo Stories