Skip to main content

Telangana Student : ఏపీ కోర్టులో తెలంగాణ బిడ్డ‌... స‌క్సెస్ స్టోరీ ఇదే..

ఏపీలో నిర్వ‌హించిన హైకోర్టు ప‌రీక్ష‌ల్లో రెండోసారి ప‌రీక్ష రాసి సివిల్ జ‌డ్జీగా ఎంపికైంది ఈ తెలంగాణ బిడ్డ‌.
Telangana student as ap high court judge  Telangana child selected as civil judge after second attempt in AP High Court exams

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీలో నిర్వ‌హించిన హైకోర్టు ప‌రీక్ష‌ల్లో రెండోసారి ప‌రీక్ష రాసి సివిల్ జ‌డ్జీగా ఎంపికైంది ఈ తెలంగాణ బిడ్డ‌. పెద్దప‌ల్లి జిల్లాలోని వ‌డ్కాపూర్ గ్రామానికి చెందిన మొగురం మొండ‌య్య‌, ల‌క్ష్మి దంప‌తులకు ఇద్ద‌రు కుమారులు, కుమార్తె గాయ‌త్రి ఉన్నారు తండ్రి వ్య‌వ‌సాయ కూలీగా ప‌నిచేస్తున్నారు.. ఈ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఈనెల 27న విడుద‌ల కాగా, తాను సాధించిన ఫ‌లితాల‌కు జ‌డ్జీగా ఎంపిక‌వ్వ‌డం అభినంద‌నీయం.

Constable Success Story : మా ఊరి నుంచి ఫ‌స్ట్‌ పోలీస్‌ అయ్యింది నేనే.. కానీ..!

గాయ‌త్రి త‌న కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేసింది. అనంత‌రం, ఉస్మానియాలో ఎల్ఎల్ఎం పూర్తి చేసింది. ఆ త‌రువాత‌, ఏపీ హైకోర్టు నిర్వ‌హించిన సివిల్ జ‌డ్జీ పోటీ ప‌రీక్ష‌ల్లో పాల్గొని, తొలిసారి అనుకున్న ఫ‌లితం రాలేదు. ఈ ప్ర‌య‌త్నంలో ఫ‌లితం సాధించ‌లేక‌పోయినప్ప‌టికీ త‌న ప‌ట్టుద‌ల‌, ఆత్మ విశ్వాసంతో మ‌రో ప్ర‌య‌త్నంలో భాగంగా రెండోసారి కూడా ప‌రీక్ష‌లో పాల్గొని నెగ్గారు గాయ‌త్రి. దీంతో తాను అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకున్నారని ఫ‌లితాల విడుద‌ల‌తో తేలిపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న కుటుంబ స‌భ్యుల ఆనందానికి హ‌ద్దుల్లేవు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 04 Dec 2024 10:53AM

Photo Stories