Singapore President: సేపిజెన్ బయోలాజిక్స్‌ను సందర్శించిన సింగపూర్ అధ్యక్షుడు
Sakshi Education
భారతదేశ పర్యటనలో ఉన్న సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం భువనేశ్వర్‌లోని అంధరువా గ్రామంలోని ఓడిశా బయోటెక్ పార్క్‌లో ఉన్న భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ సాపిజెన్ బయోలాజిక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సందర్శించారు.

ఆయనతో పాటు సింగపూర్ ప్రభుత్వ మంత్రివర్గ సభ్యులు, వ్యాపార వేత్తలు, ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం కూడా ఉన్నారు.
సాపిజెన్ బయోలాజిక్స్ ప్లాంట్ రూ.1500 కోట్ల పెట్టుబడితో స్థాపించబడింది. ఈ ప్లాంట్ వార్షికంగా 8 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 10 వేర్వేరు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాంట్‌లో కలరా, మలేరియా, గన్యా, జికా వంటి వ్యాధుల టీకాలు తయారవుతున్నాయి. ఈ టీకాలు మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు సరఫరా చేస్తారు. ప్రతి సంవత్సరం 3 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంది.
ఇక, ఈ ప్లాంట్ ద్వారా 2,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, 1,500 పరోక్ష ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.
Published date : 20 Jan 2025 06:24PM