IAS Sanjita Mahapatra Success Story : వద్దనుకున్నవారే దగ్గరైయ్యారు.. చిన్నతనంలో అన్నీ కష్టాలే.. ఐఏఎస్ ఆఫీసర్ సక్సెస్ కథ..

సాక్షి ఎడ్యుకేషన్: ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి వచ్చినట్టే అని చాలామంది భావిస్తారు. కాని, ఓ తల్లి మొదటి ప్రసవంలో కూతురు పెట్టి, రెండోసారి మగబిడ్డ అనుకున్నప్పుడు మరోసారీ ఆడపిల్లే పుట్టడంతో వదులుకోవాలనుకుంది. కాని, తన సోదరి పట్టు పట్టడంతో విడిచిపెట్టలేకపోయింది. ఇలాగే, వారి జీవితం సాగుతూ ఉండేది. కాని, ఇంటి పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉండేది. ప్రతీ ఒక్కరు పని చేస్తే కాని గడవని పరిస్థితి ఏర్పడింది. ఇలా తన జీవితంలో ఎన్ని కష్టాలు, అవరోధాలు ఆమెను వెంటాడినా తాను మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంది. చివరికి తన చిన్ననాటి కలను సాకారం చేసుకొని, ఇప్పుడు ఐఏఎస్ సంజితా మహాపాత్రగా పేరొందింది. ఇది ఆమె విజయగాథ..
బాల్యం మొత్తం..
ఒడిశాలోని రావూర్కెలాలో ఓ పేద కుటుంబంలో సంజితా మహాపాత్ర జన్మించారు. తల్లికి ఆమె పుట్టడం ఇష్టంలేకపోయినా, తన పెద్ద కూతురి పట్టు వల్ల వదల్లేదు. అయినప్పటికీ, ఇంట్లో పరిస్థితుల కారణంగా జీవితంలో కష్టాలు తప్పలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టు వీడలేదు.

కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో సంజితా బాల్యం మొత్తం ఇబ్బందులతోనే గడిచిపోయింది. చిన్నతనంలోనే తనకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే ఆశ ఏర్పడింది. దీంతో, ఎంత కష్టమైనా, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చినా, వెనకడుగు వేసేది లేదని తన కలను మాత్రమే నమ్మి ముందుకు నడిచింది.
మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా..
ఎలాగైనా చదువుకుని తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకునుంది సంజితా. ఎన్ని సమస్యలున్నా పట్టువిడవలేదు. సామాజిక సంస్థలు, ఉపాధ్యాయులు, స్కాలర్‌షిప్‌ల సహకారంతో చదువు పూర్తి చేసింది. అలా మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందింది. అనంతరం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. ఆ సమయంలోనే తల్లిదండ్రులకు వారి గ్రామంలోనే ఇల్లు కట్టుకొనేందుకు సాయం కూడా చేసింది.
చిన్ననాటి కలకు ఐదు ప్రయత్నాలు.. చివరికి..
తన చదువు పూర్తి చేసుకుంది. ఉద్యోగం కూడా సాధించింది. ఇక తన భర్త సహకారంతో కలను సాకారం చేసుకునేందుకు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం ప్రారంభించింది. కొన్ని క్లాసులు వినడం, స్వయంగా నేర్చుకోవడం, ఇతరుల సలహాలు పొందడం, రోజువారి వార్తలు తెలుసుకోవడం వంటివి చేసేది.

ఇలా, ప్రయత్నాలు చేస్తూనే ఐదు సార్లు పరీక్ష రాసింది. చివరి, ఐదవ సారి నెగ్గి.. దేశంలోనే 10వ ర్యాంకు సాధించింది. 2019లో ఐదో ప్రయత్నం చేయగా ఇది ఫలించి అందరూ గర్వపడి, స్పూర్తిగా తీసుకునే స్థాయికి ఎదిగింది సంజితా.
తల్లిదండ్రులు గర్వం..
2019లో యూపీఎస్సీ పరీక్ష రాసి దేశవ్యప్తంగా 10వ ర్యాంకు సొంతం చేసుకుంది సంజితా. దీంతో తనను కాదనుకున్న తన తల్లి కూతురిని చూసి ఎంతో గర్వించిందని సంజితా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనను కాదనుకున్న వారే దగ్గరికి తీసుకున్నారని, ఇంత స్థాయికి చేరినందుకు చాలా ఆనందంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సంజితా.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Success Story
- Ias Officer Success Story
- IAS Sanjita Mahapatra
- upsc rankers success stories
- five attempts for upsc
- latest success and inspiring stories of ias officers
- btech graduate
- struggles of ias officers
- upsc rankers 2019
- top 10 upsc rankers 2019
- UPSC Rankers Stories Latest
- all india 10th rank in upsc 2019
- IAS Sanjita Mahapatra tops rank 10 in upsc 2019 story
- IAS Sanjita Mahapatra success story in telugu
- mechnical engineer graduate to ias officer journey in telugu
- assistant manager to ias officer story in telugu
- competitive exams rankers stories in telugu
- Education News
- Sakshi Education News