Skip to main content

Success Story of Praveen Kumar : ఉద్యోగానికి రాజీనామా.. వ్యవ‌సాయంలో 48 కోట్ల వార్షిక టర్నోవర్‌తో.. స‌క్సెస్ స్టోరీ ఇదే..

జీవితంలో చ‌దివిన చ‌దువుకు త‌గిన ఉద్యోగం చేయాల‌నుకుంటారు కొంద‌రు. ఎంకేదో సాధించాల‌నే ఆశ‌యంతో చేసే ఉద్యోగాన్ని వ‌దిలేస్తారు మ‌రికొంద‌రు.
Success and inspiring story of employee to farmer praveen kumar

సాక్షి ఎడ్యుకేష‌న్: జీవితంలో చ‌దివిన చ‌దువుకు త‌గిన ఉద్యోగం చేయాల‌నుకుంటారు కొంద‌రు. ఎంకేదో సాధించాల‌నే ఆశ‌యంతో చేసే ఉద్యోగాన్ని వ‌దిలేస్తారు మ‌రికొంద‌రు. ఇలా, కొంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాల‌నే ఆశ‌యం పెట్టుకుంటారు, లేదా వ్యాపార రంగంలోకి వెళ్లాల‌నుకుంటారు, లేదా వ్య‌వ‌సాయంలోకి దిగాల‌నుకుంటారు. అయితే, వ్య‌వ‌సాయంలో కూడా ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు వ‌స్తున్నాయి కాబ‌ట్టి, ఇందులో రాణించి, మామూడుగా కాకుండా.. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌కు ఇన్నోవేషన్‌ తోడైతే ఎంతటి విజయం సొంతమవుతోందో చూపిస్తున్నాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ రైతు. 

Chai Wale Baba IAS Coaching : నోరు తెరవకుండానే.. ఐఏఎస్ కోచింగ్ ఇస్తాడు ఇలా విచిత్రంగా..!

సాగు భారమవుతున్న ప్రస్తుత రోజుల్లో, కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలేసుకొని మరీ వ్య‌వ‌సాయంలోకి దిగాడు ఈ వ్య‌క్తి. ఇత‌ను సంవత్సరానికి రూ.48 కోట్ల ఆదాయాన్ని అందుకునే ఉద్యోగి.. అటువంటిది వ్యవసాయాన్ని ఓ బిజినెస్‌గా ఎలా మార్చ‌గ‌ల‌మో చేసి చూపించాడు. ప్రదీప్‌ దాదాపు 155 ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ పేపర్లను పబ్లిష్‌ చేశారు. డెడికేషన్‌, నాలెడ్జ్‌, ముందు చూపు ఉంటే సాగును లాభసాటిగా మార్చుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఉద్యోగి నుంచి రైతుగా మారిన వ్య‌క్తి ఎవ‌రు..? ఆయన సక్సెస్‌ వెనుకున్న కారణాలేంటా.. అని ఇప్పుడు అనేక ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వాటికి స‌మాధాన‌మే ఈ క‌థ‌నం..

26 సంవ‌త్స‌రాలు ఉద్యోగం.. రిస్క్‌తోనే రాజీనామా..

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన వ్య‌క్తి ప్రదీప్‌ కుమార్‌ ద్వివేది. ఆయ‌న‌కు 45 ఏళ్ల.. ఇప్ప‌టికీ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌నే తన వృత్తిగా భావిస్తారు. ప్ర‌దీప్‌ ఫుడ్‌ సైన్స్‌లో బీటెక్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌తో త‌న చ‌దువును పూర్తి చేసుకొని, దాదాపు 26 ఏళ్ల పాటు వివిధ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశారు. ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌, ఆర్అండ్‌డీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ అనాలసిస్‌, క్వాలిటీ కంట్రోల్‌ వంటి విభాగాల్లో విధులు నిర్వర్తించారు. ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్‌, ఫార్మా, కెమికల్స్‌, హెర్బల్‌ రంగాలకు చెందిన కంపెనీల్లో అనుభవం సంపాదించారు. అనేక ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. ఇలా ఎన్నో కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ త‌న‌కంటూ కొన్ని నైపుణ్యాల‌ను ఏర్ప‌ర్చుకున్నారు. కాని, ఒకానొక సంద‌ర్భంలో భవిష్య‌త్తు గురించి ఆలోచించి 2010లో ఉద్యోగం వీడి, రిస్క్ అయినా ఆర్గానిక్ ఫార్మింగ్‌లోకి అడుగు పెట్టాల‌నుకున్నారు. ఫతేహ్‌పూర్‌ జిల్లాలో 300 ఎకరాల్లో కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ ప్రారంభించారు.

UPSC Civils Ranker Success Story : ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఐదో ప్రయ‌త్నంలో సివిల్స్‌లో కొట్టానిలా.. కానీ తండ్రి మ‌ర‌ణంతో..

న‌లుగురు రైతుల‌తో ప్రారంభం..

ప్రదీప్ కుమార్‌ పెరూ దేశంలో క్వినోవా సాగు గురించి తెలుసుకున్నారు. ఒక నలుగురు రైతులతో కలిసి క్వినోవా సాగును భార‌త్‌లో ప్రారంభించారు. ఈ సాగు ఎంత లాభదాయకమో రైతులకు రుచి చూపించారు. కాని, ఈ విష‌యం గురించి ఆ న‌లుగురు రైతుల‌కు చెప్పి ఒప్పించ‌డంలో ప్ర‌దీప్ చాలా శ్ర‌మించారు. కొనుగోలుదారులను గుర్తించడంలోనూ ఇబ్బందులు తప్పలేదు ప్ర‌దీప్‌కు. క్రమంగా ఒక్కో సవాలును అధిగమించారు. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో 40,000 మంది రైతులతో కలిసి పనిచేస్తున్నారు. సబ్జా, అవిసె గింజలతో పాటు క్వినోవా, ముల్లంగి, మునగ వంటి పంటలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

Neelaveni: జోనల్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన నీలవేణి.. టీపీ ఆఫీసర్‌ ఉద్యోగం

5 ల‌క్ష‌ల నుంచి 48 కోట్లకు.. ఈ స‌ల‌హా రైతుల‌కు..

తాను ప్రారంభించిన ఈ సాగును బిజినెస్‌గా మార్చిన ప్రదీప్‌.. వినూత్న పద్ధతులకు కూడా శ్రీకారం చుట్టారు. రైతులకు ఆయనే విత్తనాలు అందజేస్తారు. టెక్నాలజీ సపోర్ట్, కోత తర్వాత ప్రాసెసింగ్‌ పరంగా సహాయం చేస్తారు. స్వయంగా పంటను కొని విక్రయిస్తారు. దీనికోసం ప్రదీప్‌ ప్రత్యేకంగా ఆర్‌అండ్‌డీ విభాగాన్ని కూడా నెలకొల్పారు. దీనితో ఎప్పుడంటే అప్పుడు చెరకు రసాన్ని తయారు చేసుకోవచ్చు. రూ.5 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఆయన బిజినెస్‌ ఇప్పుడు ఏటా రూ.48 కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరుకుంది. నోయిడాలో క్వినోవా మిల్క్‌ ప్లాంట్‌ను స్థాపించారు.

అవార్డులు ఇవే..

2016: బెస్ట్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డ్‌

2017: బెస్ట్‌ ఫార్మర్‌ అవార్డ్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌

2018: బెస్ట్‌ ఇన్నోవేటివ్‌ ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అవార్డ్‌

2021: బెస్ట్‌ ఆర్గానిక్‌ ఫార్మర్‌ అవార్డ్‌

2018: బెస్ట్‌ ఆర్గానిక్‌ క్యాష్‌ క్రాప్‌ యాజ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అవార్డ్‌

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 16 Jan 2025 09:03AM

Photo Stories