Skip to main content

Neelaveni: జోనల్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన నీలవేణి.. టీపీ ఆఫీసర్‌ ఉద్యోగం

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌ సెంటర్‌లో ఉచిత శిక్షణ తీసుకుని జోనల్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం సాధించిన నీలవేణిని జ‌న‌వ‌రి 10న‌ స్టడీ సర్కిల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సిబ్బంది శాలువాతో సత్కరించి పుస్తకాన్ని బహూకరించారు.
Neelaveni for getting the TP job

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ స్టడీ సర్కిల్‌ సెంటర్‌లో ఉచిత శిక్షణ పొందిన నీలవేణి జోనల్‌ స్థాయి ఉద్యోగం సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నీలవేణిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ కొలువులు సాధించాలని సూచించారు.

తమ స్టడీ సర్కిల్‌ సెంటర్‌లో లైబ్రరీ సౌకర్యం ఉందని తెలిపారు. అందులో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నీలవేనితోపాటు తమ స్టడీ సర్కిల్‌ సెంటర్‌లో ఉచిత శిక్షణ పొందిన 151 మంది అభ్యర్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు వివరించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 13 Jan 2025 09:26AM

Photo Stories