Skip to main content

Education: సరికొత్త బోధన విధానం.. ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ ఇలా.. కీలక అంశాలు ఇవే!

హైదరాబాద్, సాక్షి: మారుతున్న విద్యా విధానం మేరకు కొత్త తరం ఉపాధ్యాయులు పోటీ పడి నేర్చుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
Induction and training programme for newly recruited teachers  Training session for new teachers

విద్యను పూర్తిగా సాంకేతిక కోణంలో బోధించేందుకు శిక్షణ అందించాలని నిర్ణయించింది. DSC–2024లో ఎంపికైన 10,000 మంది టీచర్లకు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభమైంది.

రాష్ట్ర స్థాయిలో సీనియర్ ఉపాధ్యాయులు రిసోర్స్ పర్సన్స్‌గా ఎంపికై కొత్త టీచర్లకు శిక్షణ అందిస్తున్నారు. అంతేకాక, ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఎంపికైన టీచర్లను కూడా ఈ శిక్షణలో భాగం చేసారు. ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రభావితం చేసే బోధనా నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోనున్నారు.

చదవండి: New Courses in BEd: బీఈడీలో కొత్త కోర్సులు

కీలక అంశాలు:

  • ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా తీర్చిదిద్దేలా కొత్త బోధన విధానాలను ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి.
  • ప్రజల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు వసతులు, పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ వంటి అంశాలను ప్రచారం చేయాలి.
  • డిజిటల్ బోధన, కొత్త మౌలిక ముల్యాంకన విధానాలు, తొలిమెట్టు & ఉన్నతి ప్రణాళికల అమలు గురించి వివరించనున్నారు.
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విద్యా రంగంలో కీలక పాత్ర పోషించబోతోంది. కొత్త తరం ఉపాధ్యాయులు టెక్నాలజీతో ముందుకు సాగాలని ప్రభుత్వం సూచించింది.
  • ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాత టీచర్లు AIపై మరింత అవగాహన పెంచుకోవాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

శిక్షణ తేదీలు:

  • మార్చి 3 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు
  • మార్చి 4-6: స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు
  • మార్చి 10-12: స్పెషల్ ఎడ్యుకేషన్, PET టీచర్లు
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 01 Mar 2025 12:42PM

Photo Stories