School Exams 2025 News: ఏప్రిల్ 9 నుంచి 1-9 తరగతుల వార్షిక పరీక్షలు ప్రారంభం
Sakshi Education

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలను ఏప్రిల్ 9 నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 20తో ముగుస్తాయి. 23వ తేదీకల్లా విద్యార్థుల ఫైనల్ ఫలితాలు వెల్లడిస్తారు. 24వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం. ఆ మర్నాడు నుంచి వేసవి సెలవులుంటాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అన్ని పాఠశాలలకు పంపింది. కాగా శనివారం నుంచి స్కూళ్లకు ఒంటి పూట బడులు మొదలు కానున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:TSPSC-RIMC Admissions: ఎనిమిదో తరగతిలో ప్రవేశాలు.. పరీక్షా విధానం, దరఖాస్తు విధానం ఇలా..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 15 Mar 2025 11:29AM