Skip to main content

Tomorrow school and Colleges Holiday : డిసెంబ‌ర్ 16వ తేదీన‌ ఈ స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు... ఎందుకంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ మ‌ధ్య‌కాలంలో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు అనుకోకుండా వ‌స్తున్నాయి. ఒక వైపు పండ‌గ‌ల రూపంలో... మ‌రో వైపు వివిధ ర‌కాలు బంద్‌లు, భారీ వ‌ర్షాల వ‌ల్ల స్కూల్స్‌కు సెల‌వులు వ‌స్తున్నాయి.
Tomorrow school and Colleges Holiday 2024

అయితే ఈ డిసెంబ‌ర్ నెల‌లో కూడా కొన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు అనుకోకుండా సెల‌వు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో రేపు అన‌గా.. డిసెంబ‌ర్ 16వ తేదీన (సోమ‌వారం) కొన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు ఇచ్చారు. 

☛➤ Inspirational Story : మాది సంచార జాతి.. చిత్తు కాగితాలు ఏరి, భిక్షాటన చేసి చ‌దివి.. నేడు డీఎస్సీ ఉద్యోగం కొట్టానిలా... కానీ..

33 జిల్లాల్లో..

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే గ్రూప్‌-2 ప‌రీక్ష కేంద్రాలు ఉన్న స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్ర‌మే ఈ సెల‌వు వ‌ర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 1368 కేంద్రాల్లో రేపు స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వు ఉంటుంది. మిగితా స్కూల్స్, కాలేజీల‌కు యథావిధిగా ఉంటుంది.

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :
జ‌న‌వ‌రి 2025 :
➤☛ నూతన సంవత్సరం – 01
➤☛ భోగి – 13
➤☛ సంక్రాంతి – 14
➤☛ రిపబ్లిక్ డే – 26

ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 15 Dec 2024 03:01PM

Photo Stories