Skip to main content

Good News Four Days Holidays 2024 : దీపావళికి వ‌రుస‌గా 4 రోజులు పాటు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... ఇంకా..!

సాక్షి ఎడ్య‌కేష‌న్ : ఇటీవ‌లె భారీగా ద‌స‌రా పండ‌గ‌కు సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అలాగే ఇటీవ‌ల కురుసిన భారీ వ‌ర్షాల‌కు వివిధ‌ జిల్లాల్లో స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చారు.
Four Day Holidays Due To Diwali

అయితే ఇదే నెల మ‌రోసారి స్కూల్స్‌కు వ‌రుస‌గా నాలుగు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. అక్టోబ‌ర్ 31వ‌ తేదీన (గురువారం) దీపావళి పండుగను జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగకు ఈసారి ఒకే రోజు సెలవు వచ్చింది. 

☛➤ TG DSC Ranker Success Story 2024 : పేదరికంతో పోరాటం చేస్తూ... అనుకున్న ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగం సాధించానిలా.. కానీ..

ఏకంగా నాలుగు రోజులు సెలవులు ఇలా...

diwali festival holidays 2024 news telugu

గురువారం  దీపావళి పండుగ కావడం, శుక్రవారం పని దినం కావడంతో స్వస్థలాలకు వెళ్ల లేక సతమతం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిని గ్రహించిన ముఖ్య‌మంత్రి నవంబర్‌ 1వ తేదీన శుక్రవారం సెలవు రోజుగా ప్రకటిస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పండుగకు ఏకంగా నాలుగు రోజులు సెలవు దక్కినట్లయ్యింది. శని, ఆదివారాల సెలవులు కలిసి రావడంతో సర్వత్రా స్వస్థలాలకు వెళ్లి పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం స్టాలిన్‌ నిర్ణయంతో సెలవుల సంఖ్య పెరిగినట్లయ్యింది.

☛➤ TG DSC Topper Success Story : రిక్షా తొక్కి వ‌చ్చిన డ‌బ్బుతో నా కొడుకుని చ‌దివించానిలా... కానీ...

తెలుగు రాష్ట్రాల్లో...
అయితే తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీల‌కు న‌వంబ‌ర్ 31వ తేదీన (గురువారం) సెల‌వు ఇచ్చారు. అయితే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించిన న‌ట్లు.. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా సెల‌వులు ప్ర‌క‌టిస్తే.. వ‌రుస‌గా సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

ఈ సెల‌వుల కోసం ప్ర‌త్యేకంగా..

.
రానున్న దీపావళి పండుగ సంద‌ర్భంగా... ప్రత్యేక బస్సులను అదనంగా నడిపేందుకు రవాణా సంస్థ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 40 మేరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ రైల్వే కసరత్తు చేపట్టింది. ఒకటిరెండు రోజులలో ప్రత్యేక బస్సులు, రైళ్ల జాబితా వెలువడబోతున్నాయి. అదే సమయంలో నవంబర్‌ 1వ తేదీ సెలవును భర్తీ చేసే విధంగా అదే నెల 9వ తేదీని పనిదినంగా పరిగణించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

➤☛ ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న‌ చనిపోయినా.. మా అమ్మ...

దీంతో కాలేజీ, స్కూల్స్‌, ఉద్యోగులు..
దీపావళి సందర్భంగా ఆరు కొత్తరకం పలహారాలను ఆవిష్కరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్‌ నిర్ణయించింది. 20 శాతం మేరకు పండుగ సందర్భంగా తమ ఉత్పత్తులను పెంచుకునేందుకు సిద్ధమైంది. దీంతో దీపావళి పండుగకు నాలుగు రోజులు సెలవు కలిసి వచ్చాయి. దీంతో కాలేజీ, స్కూల్స్‌, ఉద్యోగులు టూర్ల‌కు ప్లాన్ చేసుకుంటున్నారు.

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు

Published date : 21 Oct 2024 03:00PM

Photo Stories