Skip to main content

Dasara Holidays 2024 Extended : విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌... దసరా సెల‌వులు పొడిగింపు.. కార‌ణం ఇదే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల స్కూల్స్ ,కాలేజీ విద్యార్థులు దసరా పండగ సెల‌వులల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని స్కూల్స్‌కు అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.
Dasara Holidays 2024 Extended For Schools

అలాగే తెలంగాణ‌లో అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వ‌ర‌కు స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చారు. అయితే దసరా పండగ సందర్భంగా.. తాజాగా విద్యార్థులకు సంతోషం ఇచ్చే.. మరో కీలక విషయం బయటకొచ్చింది. 

ఇప్పుడు మరో రోజు సెలవు ప్రకటిస్తూ...
తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లకు అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి 15న స్కూళ్లు ప్రారంభమవుతాయని చెప్పింది. అయితే రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు మాత్రం అక్టోబర్ 2 నుంచి 13 వరకు మాత్రమే సెలవులు ప్రకటించాయి. అలాంటి స్కూల్స్ అన్నీ ఇప్పుడు మరో రోజు సెలవు ప్రకటిస్తూ తల్లిదండ్రులకు సందేశాలు జారీ చేస్తున్నాయి.

అక్టోబర్ 31వ తేదీన తేదీన కూడా...

diwali festival holidays 2024

మరో రెండు రోజుల్లో దసరా పండగ ఉన్న నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు దసరా సెలవులను ఒక్క రోజు పొడగించాయి. ఇందుకు సంబంధించి కొందరు పేరెంట్స్ కి మెసేజెస్ వస్తున్నాయి. దీంతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే అక్టోబర్ 31వ తేదీన గురువారం దేశ‌వ్యాప్తంగా అన్ని స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీస‌ల‌కు దీపావళి పండ‌గ సంద‌ర్భంగా సెల‌వును ప్ర‌క‌టించారు.

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే...

➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు

Published date : 10 Oct 2024 04:29PM

Photo Stories