Skip to main content

Tomorrow Schools Holiday Due Rain : రేపు అన్ని స్కూల్స్‌కు సెల‌వు ప్ర‌క‌ట‌న‌... ఎల్లుండి కూడా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రేపు అన్ని స్కూల్స్‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు వివిధ జిల్లా క‌లెక్ట‌ర్లు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వివిధ జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Schools Holiday  School holidays announced due to heavy rains  Heavy rains expected in Telangana and Andhra Pradesh Weather alert for heavy rains in Telangana

రానున్న రెండు రోజుల్లో కోస్తాలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. 

విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు ఆరెంజ్ అలర్ట్.. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్ఠంగా 70 కిలోమీటర్లు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమిని పట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 

సెప్టెంబ‌ర్ 10వ తేదీన కూడా అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు..

సెప్టెంబ‌ర్ 10వ తేదీ అన‌గా.. మంగ‌ళ‌వారం  అతిభారీ వ‌ర్షాల కార‌ణంగా విశాఖ పట్నం, అన‌కాప‌ల్లి, కాకినాడ‌, ప‌శ్చిమ గోదావ‌రి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు ఈ జిల్లాల క‌లెక్ట‌ర్లు సెల‌వులు ప్ర‌క‌టించారు.

School Holiday Cancel : ఆరోజు స్కూళ్ల‌కు సెల‌వు క్యాన్సెల్.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..!

ఏపీలో  ఈ జిల్లాల్లో అన్ని స్కూల్స్‌కు సెల‌వు.. ఇంకా..!
ఇప్ప‌టికే అంబేడ్క‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ సెప్టెంబ‌ర్ 9వ తేదీ (సోమ‌వారం) అన్సి స్కూల్స్‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, పార్వ‌తీపురం, అల్లూరి జిల్లాల క‌లెక్ట‌ర్లు అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూల్స్‌కు రేపు  సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. ఇంకా ఇలాగే భారీ వర్షం కొన‌సాగితే... మంగ‌ళ‌వారం కూడా స్కూల్స్‌కు సెల‌వు ఇవ్వ‌నున్నారు. అలాగే ఉమ్మ‌డి  గోదావ‌రి జిల్లాల్లో కూడా స్కూల్స్‌కు రేపు సెల‌వు ఇచ్చారు. రేపు సెల‌వు ఇచ్చారు. బాప‌ట్ల జిల్లాలోని కొన్ని మండ‌లాల‌కు కూడా సెల‌వు ప్ర‌క‌టించారు.అన‌కాప‌ల్లి, కాకినాడ‌, ఎలూరు జిల్లాల్లోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.ఒక వేళ పై జిల్లాల్లో సెల‌వు ఇవ్వ‌కుంటే.. స్కూల్స్ యాజ‌మాన్యంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు.

రేపు, ఎల్లుండి స్కూల్స్‌కు..
తెలంగాణ‌లోని నేడు, రేపు  హైద‌రాబాద్‌, సంగారెడ్డి, కుమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు, ఎల్లుండి కూడా కుమురం భీం అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ‌లోని వివిధ జిల్లాల‌ క‌లెక్ట‌ర్లు స్కూల్స్‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

సెప్టెంబర్ 2024లో బ్యాంక్ సెల‌వులు ఇవే..
☛➤ సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి ఆదివారం ( ఈ రోజు బ్యాంక్ సెల‌వు ఉంటుంది)
☛➤ సెప్టెంబర్ 5వ తేదీ గురువారం : శ్రీమంత శంకరదేవ తిథి (అస్సాంలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 7వ తేదీ శనివారం : వినాయక చతుర్థి
☛➤ సెప్టెంబరు 8వ తేదీ ఆదివారం సెలవు (ఒడిషాలో నౌకై పండుగ)
☛➤ సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం : రామ్‌దేవ్ జయంతి, తేజ దశమి (రాజస్థాన్‌లో సెలవు)
☛➤ సెప్టెంబర్ 14వ తేదీ  రెండవ శనివారం ( కేరళలో ఓనం)
☛➤ సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం సెలవు (కేరళలోని తిరువోణం)
☛➤ సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం: ఈద్ మిలాద్
☛➤ సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం: ఇంద్ర జాత్ర (సిక్కింలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 21వ తేదీ శనివారం: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం సెలవు
☛➤ సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం : బలిదాన్ డే (హర్యానాలో సెలవు)
☛➤ సెప్టెంబర్ 28వ తేదీ నాల్గవ శనివారం
☛➤ సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సెలవు

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

Published date : 09 Sep 2024 08:41PM

Tags

Photo Stories