Skip to main content

AP Schools System Changes : ఇక‌పై పాత పద్ధతిలోనే స్కూళ్లు.. పలు మార్పులు ఇవే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పాఠశాలల స్ట్రక్చర్‌ను మారుస్తూ.. గత ప్రభుత్వం జారీచేసిన GO 117ను ఉపసంహరించాలని ప్ర‌స్తుత‌ కూటమి సర్కారు నిర్ణయించింది.
AP Schools System Changes

అంతకు ముందున్న విధానాన్నే స్వల్ప మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తోంది. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (pp1 pp2), ఫౌండేషనల్ స్కూల్ (pp1, pp2, 1, 2) బేసిక్ ప్రైమరీ(1-5), మోడల్ ప్రైమరీ(pp1, pp2, 1-5), హైస్కూల్ (6-10) విధానంలో స్కూళ్లు ఉంటాయి. విధి విధానాలపై విద్యాశాఖ మెమో జారీచేసింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. సెమిస్టర్ల వారీగా అన్నింటిని కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది. 3, 5వ‌ తరగతులకు మొదటి సెమిస్టర్‌లో భాష సబ్జెక్టులు అన్ని కలిపి ఒక పుస్తకం, వర్క్‌బుక్, ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పుస్తకం, వర్క్‌బుక్‌ ఇస్తారు.

➤☛ AP Government Jobs 2025 : 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. త్వ‌ర‌లోనే..?

9,10వ‌ తరగతుల్లో ప్రస్తుతం ఉన్న హిందీ పాఠ్యపుస్తకాన్ని తొలగించి, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకొస్తారు. అనుమతి లేకుండా గైర్హాజరైతే నెలకో పాయింట్‌ తగ్గింపు అనుమతి లేకుండా గైర్హాజరయ్యే ఉపాధ్యాయులకు బదిలీల సమయంలో నెలకో పాయింట్‌ చొప్పున గరిష్ఠంగా 10 మైనస్‌ పాయింట్లు ఇస్తారు. సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలను నవీకరించుకోవాలి.

1,2 తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్‌ అన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురానున్నారు. దీనికి అదనంగా మరో వర్క్‌బుక్‌ ఉంటుంది. రెండో సెమిస్టర్‌లోనూ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక పాఠ్యపుస్తకంగా ఇస్తారు. వర్క్‌బుక్‌ ఉంటుంది.

Published date : 11 Jan 2025 04:25PM

Photo Stories