Telangana Gurukul Admissions : తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
సత్తుపల్లి పట్టణంలోని గుడిపాడు రోడ్డులో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాలలో 2024-2025 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం ఇంటర్ ఎం.పి.సి, బై.పీ.సీ ఇంగ్లీష్ మీడియం మొదటి ఏడాదిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు కళాశాల యాజమాన్యం. ఈ మెరకు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ కె.వెంకట రామయ్య ప్రకటించారు. ప్రవేశాలు, దరఖాస్తుల వివరాలు..
Permanent Work From Home jobs జీతం నెలకు 33500: Click Here
ఖాళీలు ఇవే..
గురుకుల కళాశాలలో 5వ తరగతిలో 80 సీట్లకు గాను 75% మైనారిటీలకు, 25% నాన్ మైనారిటీ (ఎస్సి, ఎస్టి, బిసి, ఓసి) లకు ఖాళీలు ఉన్నాయి. అయితే, ఇంటర్ మొదటి సంవత్సరం ఎం.పి.సి, బై.పీ.సీ లలో 80 సీట్లకు గాను 75% మైనారిటీలకు, 25%నాన్ మైనారిటీ (ఎస్సి, ఎస్టి, బిసి, ఓసి) లకు ఖాళీలు కలవు. పైన తెలిపిన తరగతలలో గల ఖాళీలే కాకుండా ఇంటర్ 2వ సంవత్సరం 6, 7, 8 వ తరగతి లో గత సంవత్సరం మిగిలిన మైనారిటీ ,నాన్ మైనారిటీ సీట్లను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ముఖ్యమైన వివరాలు..
కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు 18-01-2025 నుంచి 28-2-2025 వరకు అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆఫ్‌లైన్ లో వివరాల నమోదు కోసం ఉదయం 9 నుండి సాయంత్రం 4.30 ని.ల. వరకు కళాశాల నందు ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించలని, ప్రిన్సిపాల్.కె. వెంకట్రామయ్య కోరారు. ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం tmreis.cgg.gov.in website, https://tmreis.telangana.gov.in సందర్శించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, TMREIS app నందు కానీ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు కోసం సెల్ 73311 70864, 8328 111 525 సంప్రదించాలని కోరారు.
Tags
- Gurukul admissions
- gurukul school admission
- Latest admissions
- minority gurukula schools
- Telangana Social Welfare Gurukul School admissions 2025
- Telangana Social Welfare Gurukul School
- Telangana Education
- admissions applications for gurukulas
- Admission applications
- Telangana Social Welfare Gurukul School admissions Notification Released
- Telangana Minority Gurukula College admissions
- 5th class English medium admissions 2024-2025
- Inter MPC first year admissions
- BIPC first year admissions