5th Class Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
కైలాస్‌నగర్: 2025–26 విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు, 6నుంచి 9వ తరగతుల్లోని ఖాళీల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

http@/tgcet.cgg.gov.in లో ఫిబ్రవరి 1వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ప్రక్రియలో సందేహాలున్నా, సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులను పరిష్కరించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించాలని అధికారులు సూచించారు.
చదవండి: BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
![]() ![]() |
![]() ![]() |
Published date : 18 Jan 2025 11:25AM