Skip to main content

AP Holidays Latest News: ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా..?

AP Holidays Latest News   2025 AP Government Public Holidays List   List of Public Holidays for Schools in 2025
AP Holidays Latest News

సాధారణంగా ప్రభుత్వాలు ఆయా డిసెంబర్‌ నెల రాగానే వచ్చే సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అందులో పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన సెలవులు, అలాగే వివిధ పండగలకు సంబంధించిన సెలవులు ఉంటాయి.

ఏపీ హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలు జీతం నెలకు 35,000: Click Here

ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి సెలవుల జాబితా ఉలా ఉంది.. పాఠశాలలు, సంస్థలకు జాతీయ, రాష్ట్ర సెలవులతో సహా 2025కి సంబంధించిన ప్రభుత్వ సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. స్టడీ మెటీరియల్‌ను సేకరించడంతో పాటు, సంవత్సరానికి సంబంధించిన సెలవు క్యాలెండర్‌ను ఇటీవల ప్రకటించింది.

పాఠశాలలకు 2025 సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇది అన్ని ఏపీ బోర్డు పాఠశాలలకు వర్తిస్తుంది. హాలిడే క్యాలెండర్ జాబితా అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ విడుదల చేసిన జాబితాలో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేలు కలుపుకొని మొత్తం 44 రోజులు సెలవులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

తాజా ప్రకటన ప్రకారం.. 2025లో మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

S. No. పండుగ తేదీ రోజు
1 భోగి 13.01.2025 సోమవారం
2 మకర సంక్రాంతి 14.01.2025 మంగళవారం
3 కనుమ 15.01.2025 బుధవారం
4 రిపబ్లిక్ డే 26.01.2025 ఆదివారం
5 మహా శివరాత్రి 25.02.2025 బుధవారం
6 హోలీ 14.03.2025 శుక్రవారం
7 ఉగాది 30.03.2025 ఆదివారం
8 ఈద్-ఉల్-ఫిత్ర్ (రంజాన్) 31.03.2025 సోమవారం
9 బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు 05.04.2025 శనివారం
10 శ్రీరామ నవమి 06.04.2025 ఆదివారం
11 డా. బ్రాంబేద్కర్ పుట్టినరోజు 14.04.2025 సోమవారం
12 శుభ శుక్రవారం 18.04.2025 శుక్రవారం
13 బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) 07.06.2025 శనివారం
14 మొహర్రం 06.07.2025 ఆదివారం
15 వరలక్ష్మి వ్రతం 08.08.2025 శుక్రవారం
16 స్వాతంత్ర్య దినోత్సవం 15.08.2025 శుక్రవారం
17 శ్రీకృష్ణాష్టమి 16.08.2025 శనివారం
18 వినాయక చవితి 27.08.2025 బుధవారం
19 ఈద్ మిలాద్ ఉన్ నబీ 05.09.2025 శుక్రవారం
20 దుర్గాష్టమి 30.09.2025 మంగళవారం
21 మహాత్మా గాంధీ జయంతి, విజయ దశమి 02.10.2025 గురువారం
22 దీపావళి 20.10.2025 సోమవారం
23 క్రిస్మస్ 25.12.2025 గురువారం

 

2025లో ఆదివారాల్లో వచ్చే పండుగలు

 


S.No. పండుగలు తేదీ రోజు
1 రిపబ్లిక్ డే 26.01.2005 ఆదివారం
2 ఉగాది 30.01.2021 ఆదివారం
3 శ్రీరామ నవమి 06.04.2020 ఆదివారం
4 మొహర్రం 06.07.2020 ఆదివారం


2025లో మొత్తం 23 సెలవు దినాలుగా పేర్కొంది ఏపీ సర్కార్‌. ఇందులో నాలుగు సెలవులు ఆదివారం వచ్చాయి. రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం వచ్చాయి. అందుకే ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో కేవలం 19 మాత్రమే ఉద్యోగులకు లభిస్తాయి.

అక్టోబర్ 2 గాంధీజయంతి, విజయదశమి రెండు సెలవులు కూడా కలిసిపోయాయి. వీటితోపాటు 21 ఆప్షనల్ హాలిడేలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ముందస్తు సమాచారంతో ఐదు సెలవుల దినాలను అధికారులు వాడుకోవచ్చు.

ఇందులో కూడా ఈద్-ఈ- గదర్, మహలాయ అమావాస్య ఆదివారం వస్తున్నాయి. మే నవంబర్‌లో ఎలాంటి సెలవులు లేకపోగా.. జనవరి ఏప్రిల్‌, ఆగస్టులో ఎక్కువగా నాలుగు సెలవులు వస్తున్నాయి. మొత్తంగా ఏడాదిలో పది నెలల్లో సెలవులు ఉన్నాయి.. రెండు నెలల్లోనే ఎలాంటి సెలవులు లేవని గమనించాలి.

 

Published date : 13 Jan 2025 03:30PM

Tags

Photo Stories