AP Government Introduces Water Bell System in Schools: స్కూళ్లలో వాటర్ బెల్ తప్పనిసరి.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: ఎండ తీవ్రత నేపథ్యంలో అన్ని స్కూళ్లలో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఎక్కువగా నీళ్లు తాగేలా చూసుకోవాలన్నారు. స్కూళ్లలో మంచినీరు అందుబాటులో ఉండేలా స్కూల్ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
AP Government Introduces Water Bell System in Schools
ఉదయం 8.45 గంటలకు ఒకసారి, 10.50 గంటలకి రెండోసారి, 11.50 గంటలకు మూడోసారి బెల్ మోగించి మంచినీళ్లు తాగేందుకు వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం ఎండ తీవ్రత దృష్ట్యా జాగ్రత్త వహించాలని, స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించే వరకు అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్ విధిగా పాటించాల్సిందిగా అధికారులకు సూచించారు.