Half Day for Anganwadi Centers : అంగన్వాడీలకూ ఒంటిపూట ప్రారంభం.. టీచర్లకు, ఆయాలకు కూడా..

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఒంటిపూట నిర్వహించాలని తల్లిదండ్రులు, అక్కడి సిబ్బంది ప్రభుత్వాన్ని కోరింది. దీంతో, ఎట్టకేలకు ప్రభుత్వం కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించి, ఒంటిపూట నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే తెలంగాణలోని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మన రాష్ట్రంలోని విద్యాసంస్థలను ఈ నెల 15 నుంచి ఒంటిపూట నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆరేళ్లలోపు చిన్నారులు ఉండే అంగన్‌వాడీ కేంద్రాలను రెండు పూటలా నిర్వహిస్తుండటంతో పిల్లల ఇబ్బందులపై ‘అంగన్‌వేడీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
మే 31వరకు..
మొదట ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... ‘సాక్షి’ కథనంతో స్పందించి మంగళవారం నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రవేశాలు.. పరీక్ష లేకుండా ప్రవేశాలు!
దీంతో అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం నుంచి మే 31వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించేలా అన్ని జిల్లాల అధికారులు, అంగన్‌వాడీ టీచర్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపించారు. అదేవిధంగా అంగన్‌వాడీ టీచర్లకు మే 1 నుంచి 15 వరకు, ఆయాలకు మే 16 నుంచి 31వ తేదీ వరకు 15 రోజులు చొప్పున సెలవులు ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Anganwadi Centers
- AP Anganwadi
- half day anganwadi
- AP government
- Women And Child Welfare Department
- anganwadi children health and education
- May 31
- half day schools
- AP Schools
- half day schools in ap latest updates
- ap district anganwadi centers
- half day for ap anganwadi center
- half day and holidays for teachers and anganwadi staff
- summer holidays for anganwadi centers news
- heavy heat in anganwadi centers
- Education News
- Sakshi Education News