Skip to main content

Half Day Schools 2025 : మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు.. ఇంకా ముందుగానే ఇచ్చేందుకు...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ సారి ఎండ‌లు, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చ‌రిస్తోంది. ఈ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుంద‌ని.. అలాగే వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
half day schools 2025 on 2025 march 15th

125 సంవత్సరాల సరాసరి సగటు తీసుకుంటే గాలిలో తేమ చాలా తగ్గిందని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావ‌ర‌ణ శాఖ‌ వెల్లడించింది.

☛➤ Tomorrow Schools and Colleges 2025 : రేపు, మార్చి 3వ తేదీన స్కూళ్లు, కాలేజీలకు సెల‌వు.. ఎందుకంటే.. ?

మార్చి 15వ తేదీన లేదా... ఇక ముందే...
వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల‌తో... ఈ ఎండలు తీవ్రత దృష్ట్యా... ఒంటిపూట బడులు ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై చర్చలు మొదలయ్యాయి. 
మార్చి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయ్‌. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు ఏపీ విద్యాశాఖ ఆలోచ‌న‌లో ఉంది. అలాగే తెలంగాణ విద్యాశాఖ కూడా... మార్చి 15వ తేదీ కంటే ముందే... ఒంటిపూట బడులు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది.

☛➤ 100 Days Holidays: ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ 2025 సంవత్సరంలో 100 రోజులు సెలవులు

☛➤ AP Inter Colleges Summer Holidays 2025 : ఏపీలో ఇంట‌ర్ కాలేజీల‌కు వేస‌వి సెల‌వులు.. ? మొత్తం ఎన్ని రోజులంటే...?

Published date : 03 Mar 2025 08:57AM

Photo Stories