Skip to main content

Half Day Schools : నేటి నుంచి ఒంటిపూట బడులు.. ఎప్ప‌టివ‌ర‌కు అంటే..!!

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరిగిపోతున్న ఎండ‌ల తీవ్రత కార‌ణంగా ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నున్నారు.
Half day schools in ap and tg from march 15th   School timings changed due to heat in Telangana

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరిగిపోతున్న ఎండ‌ల తీవ్రత కార‌ణంగా ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే స‌మ‌యాన్ని, తేదీల‌ను కూడా ప్ర‌క‌టించ‌న‌గా.. నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా సాధార‌ణ పాఠ‌శాల‌లు ఉద‌యం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తారు.

Open School Exams Schedule: ఓపెన్ స్కూల్ పరీక్షలు షెడ్యూల్ విడుదల

ఇక‌, పదోతరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తారు. ఏపీలోని పాఠ‌శాల‌ల‌కు ఉద‌యం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు బడులు నిర్వ‌హిస్తారు. పదోతరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో మధ్యాహ్నం 1:15గంట‌ల‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వ‌హిస్తారు.

తేదీలు.. వివ‌రాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బ‌డులు నేటి నుంచి ప్రారంభ‌మై, వ‌చ్చేనెల ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఇక‌, రంజాన్ కోసం ముస్లింల పాఠశాల‌ల‌కు ఇప్ప‌టికే ఒంటిపూట బ‌డుల‌ను ప్రారంభించారు. అయితే, విద్యార్థుల‌కు ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ఉంటాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 15 Mar 2025 11:24AM

Photo Stories