Skip to main content

Tomorrow Schools and Colleges Bandh : రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్... ఎందుకంటే.. ?

సాక్షి ఎడ్యుకేష‌న్ : రేపు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. ఇవాళ ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. రేపు కూడా ఇదే పరిస్థితి వుండనుంది.
tomorrow all schools and colleges bandh

మన్యం ప్రాంతంలోని ఆదివాసి, గిరిజన సంఘాలు తమ హక్కులను కాపాడుకునేందుకు 48 గంటలపాటు బంద్ పాటిస్తున్నాయి. వీరికి వామపక్షాలు, వైసిపి మద్దతు తెలిపింది. దీంతో మన్యంప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలే కాదు షాపులు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి.

☛➤ Three Days School Holidays : ఫిబ్రవరి 14, 15,16వ తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు...!

విశాఖపట్నం పరిసరాల్లోని గిరిజన ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఫిబ్రవరి 12 తేదీన‌ మూతపడనున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజ జిల్లాలో ఈ బంద్ కొనసాగుతోంది. విశాఖ మన్యం ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే బంద్ మొదలయ్యింది. ఉదయమే రోడ్డెక్కిన గిరిజన సంఘాలు, వామపక్ష నాయకులు ముందుగా ఆర్టిసి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం షాపులు, ఇతర కార్యాలయాలను మూసివేయించారు.

కార‌ణం ఇదే...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఏకంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బంద్‌కు కారణమయ్యారు. కొంతకాలంగా మన్యంలోని ఆదివాసీ, గిరిజనులు తమకు అన్యాయం జరుగుతోందని అసంతృప్తితో వున్నారు.

☛➤ AP Forest Department Jobs 2025 : ఏపీ అటవీ శాఖ 689 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. ఎప్పుడంటే...?

గిరిజన ప్రాంతాల్లో టూరిజం డెవలప్ మెంట్ గురించి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. 1/70 చట్టం గురించి ప్రస్తావించారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు ఆటంకం కలుగుతోంది... కాబట్టి పర్యాటక కేంద్రాలను ఫ్రీజోన్ గా ప్రకటించాలని సూచించారు. తద్వారా టూరిస్టులను మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి... ఆ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఆదాయం వస్తుందన్నారు. కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు అయ్యన్నపాత్రుడు సూచించారు. ఇదే మన్యం ప్రాంతంలోని గిరిజనులు, ఆదివాసీలు ఆగ్రహానికి కారణం అయ్యింది. తమ హక్కులను కాలరేసేలా 1/70 చట్టాన్ని రద్దు చేయాలని స్పీకర్ సూచించడంపై భగ్గుమంటున్నారు. ఇందుకు నిరసగానే 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు.

➤☛ QR Code on Question Paper : ఈసారి క్వ‌శ్చ‌న్‌ పేప‌ర్‌పై క్యూఆర్ కోడ్‌.. కేంద్రంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

ముందుగానే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు..
ఇక ముందుగానే బంద్ పై సమాచారం వుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు నడిపే ప్రయత్నంచేయగా ఆదివాసీ సంఘాల నాయకులు మూసివేయించారు. 

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాయిదా..
ఈ బంద్ కార‌ణంగా ఇవాళ, రేపు జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను అధికారులు వాయిదా వేసారు. ఆదివాసీ సంఘాలు చేపట్టిన ఈ బంద్‌కు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తోంది. వైసిపి నాయకులు బంద్‌లో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం అడవిబిడ్డల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని.. వీళ్ల‌ తీరు మారకుంటే ఆదివాసీ, గిరిజనులతో కలిసి ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని వైపీసీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :
ఫిబ్రవరి 2025  :

➤☛ ఫిబ్రవరి 14 : 'షబ్‌ ఏ బరాత్‌'

➤☛ ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి

➤☛ మహ శివరాత్రి – 26 ఫిబ్రవరి 

➤☛ ఎమ్మెల్సీ ఎన్నికలు – 27 ఫిబ్రవరి 

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26

Published date : 12 Feb 2025 10:57AM

Photo Stories