Gates Foundation: గేట్స్ ఫౌండేషన్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

ఈ నిర్ణయాన్ని ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో తీసుకున్నారు.
ఈ ఒప్పందం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఈ ఐదు రంగాలలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని వాటిని వాస్తవంలో అమలు చేయాలని లక్ష్యం. ముఖ్యంగా.. గేట్స్ ఫౌండేషన్ కృత్రిమ మేధన (AI), శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా.. ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే విశ్లేషించి, సంబంధిత చర్యలు సూచించడంలో సహాయం చేస్తుంది.
ఇదే విధంగా.. వ్యవసాయ రంగంలో పంటల సాగు, వనరుల నిర్వహణపై కూడా ముందస్తుగా సలహాలు, సూచనలు అందించడం ద్వారా సాగు పద్ధతులను మెరుగుపరచడం, వనరుల సరఫరాలో సమర్థత సాధించడం వంటి సమస్యలకు పరిష్కారాలు సూచించబడతాయి. ఈ ఒప్పందం ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను అమలుచేసే భాగస్వామ్య సంస్థలు కూడా అవసరమైన సహకారం అందుకోవచ్చు.
Groundwater Level: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు